శిల్పా వివాహం డిసెంబర్ లో
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/shilpa-rajkundra.jpg' align='right' alt='Shilpa-Raj'>బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఈ శీతాకాలంలోనే పెళ్ల పీటల మీద కూర్చోబోతోంది. తన చిరకాల బాయ్ ఫ్రెండ్ రాజ్ కుంద్రతో లండన్ లో శిల్పా వివాహం వచ్చే డిసెంబర్ లో జరగనుంది. నిజానికి ఈ విషయాన్ని శిల్పా, ఆమె కుటుంబ సభ్యులు రహస్యంగా ఉంచాలని అనుకున్నప్పటికీ బయటకు పొక్కింది.
లండన్ బిజినెస్ మన్ అయిన రాజ్ కుంద్రా కొద్దికాలంగా శిల్పా బిజినెస్ వ్యవహారాల భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులందరికీ కుంద్రా ఎంతో దగ్గరయ్యాడనీ, ఆయన చేయందుకునే ఘడియ మాత్రం ఇంకా రాలేదనీ శిల్పా చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో శిల్పా తండ్రి సురేంద్ర శెట్టి మంగళవారంనాడు సూరత్ కోర్టు ముందు హాజరైనప్పుడు శిల్పా వివాహానికి సంబంధించిన ముచ్చట బయటకు వచ్చింది. సురేంద్ర శెట్టి 2003లో దుస్తుల వ్యాపారులతో తగాదాకు దిగిన కేసులో ఆయన పాస్ పోర్టును కోర్టు స్వాధీనం చేసుకుంది. తన కుమార్తె వివాహం లండన్ లో ఇదే డిసెంబర్ లో అనుకుంటున్నామనీ, అక్కడకు తాము వెళ్లేందుకు వీలుగా పాస్ పోర్టును ఇప్పించాలని సురేంద్ర శెట్టి కోర్టును కోరారు. ఆ విషయం మీడియాకు పొక్కింది. అయితే వివాహ వార్తను ధ్రువీకరించేందుకు శిల్పా, రాజ్ కుంద్రా అందుబాటులో లేరు. వివాహానంతరం శిల్పా నటిగా కొనసాగుతుందా లేదా అనేది కూడా తెలియవలసి ఉంది.
News Posted: 26 August, 2009
|