షారూక్ తో 'ధూమ్-3'
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/sarukh-don.jpg' align='left' alt=''>యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై బాలీవుడ్ ను షేక్ చేసిన 'ధూమ్', 'ధూమ్-2' చిత్రాలకు మరో సీక్వెల్ రూపొందించేందుకు ప్రముఖ దర్శక నిర్మాత ఆదిత్య చోప్రా సన్నాహాలు చేస్తున్నారు. 'ధూమ్-3' పేరుతో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్న చోప్రా ఈసారి మాత్రం స్వయంగా ఈ సీక్వెల్ కు దర్శకత్వం వహించబోతున్నారు. 'ధూమ్', 'ధూమ్-2' చిత్రాలకు ఆయన నిర్మాతగానే వ్యవహరించగా, సంజయ్ గధ్వి దర్శకత్వం వహించారు. 'ధూమ్-3' చిత్రాన్ని షారూక్ ఖాన్ తో చోప్రా ప్లాన్ చేస్తుండటం విశేషం. షారూక్ తో సమానమైన పాత్రలో హృతిక్ రోషన్, మరో హీరోగా అభిషేక్ బచ్చన్ ను అనుకుంటున్నారు.
షారూక్ ఇంతకు ముందెన్నడూ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో పనిచేసేందుకు విముఖత చూపలేదు. హృతిక్ రోషన్ సైతం ప్రస్తుతం తన హోం బ్యానర్ లో 'కైట్స్', సంజయ్ లీలా భన్సాలీ 'గుజారిష్' చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ ఆఫర్ ను కాదనక పోవచ్చు. అభిషేక్ గత రెండు చిత్రాల్లో నటించిన పాత్రనే ఇందులోనూ కంటిన్యూ చేస్తారు. చోప్రా అనుకుంటున్నట్టుగా ఈ స్టార్ త్రయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆయన పట్టుదలగా ఉన్నారు. ఖాన్-రోషన్-బచ్చన్ ఫ్యామిలీ హీరోలు కలిస్తే ఇక సంచలనాలకు కొదవేముంటుంది?!
News Posted: 26 August, 2009
|