నన్ను చీట్ చేస్తున్నారు: రాఖీ
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/rakhi-sawant6.jpg' align='right' alt=''>రోజూ ఏదో ఒక వార్తలో కనిపించకపోతే రాఖీ సావంత్ కూ, ఆ వార్త కనబడకపోతే జనాలకు నిద్ర పట్టదేమో. 'స్వయంవరం'లో తనకు కావాల్సిన వరుడు ఎలేష్ ను వెతుక్కుని ప్రస్తుతానికి మాత్రం నిశ్చితార్ధంతోనే సరిపెట్టేసిన రాఖీ ఇప్పుడు ఎలేష్ ని సొంతకాళ్లపై నిలబెట్టేందుకు తాపత్రయ పడుతోంది. పెళ్లి చేసుకునే లోపు రాఖీ సెక్సీ ఫోటోలంటూ మార్ఫింగ్ ఫోటోలు రిలీజ్ చేసి తనను ఇబ్బంది పెడతారమోనంటూ రాఖీ భయాందోళనలు కూడా వ్యక్తం చేస్తోంది. ఎలేష్ మాత్రం తనను తప్పుపట్టేంత చిన్న మనసు కాదని కూడా ఇంకో స్టేట్ మెంట్ కూడా పడేసింది. ఇప్పుడు రాఖీకి మరో ఆందోళన మొదలైంది. షాహిద్ కపూర్ , రాఖీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన 'దిల్ బోలె హడిప్పా'లో తన పాత్రను కుదించేస్తారేమోనని తెగ వర్రీ అవుతోంది. ఇందులో రాఖీ మూడు సాంగ్స్ కూడా చేనప్పటికీ సినిమా ట్రయిలర్స్ లో రాణీ చేసిన ఐటెం సాంగ్ నే నిర్మాతలు ప్రముఖంగా ప్రచారం చేస్తుండటంతో రాఖీకీ తాజా బెంగ పట్టుకుంది.
'ఈ సినిమా కోసం నేనెంత కష్టపడ్డానో ఎవరికి తెలుసు? నాలుగు నెలల పాటు షూటింగ్ లో పాల్గొన్నాను. మూడు సాంగ్స్ , ఐదారు సన్నివేశాలు నాపై చిత్రీకరించారు. రిలీజ్ నాటికి నా పాత్ర ఎంతవరకు ఉంచుతారో అర్ధం కావడం లేదు' అంటూ రాఖీ మూతి బిగిస్తోంది. స్వయంకృషితో పైకొచ్చే వాళ్లంటే ఇండస్ట్రీకి లోకువని చెబుతూనే 'నా కెరీర్ ఆ జీసస్ తోనే ముడిపడింది. ఇంకెవర్నీ విశ్వసించను. నేనెవరికీ చెడు జరగాలని అనుకోను. నేను చాలా ఫెర్ ఫెక్ట్ నటినను చెప్పుకోవడం లేదు. అయితే నా ప్రతిభ ఏమిటో నాకు బాగా తెలుసు. స్వయంకృషితో పైకొచ్చాను. ఆ క్వాలిటీ ఉన్నవాళ్లంటే ఇండస్ట్రీకి ఎప్పుడూ లోకువే' అంటూ రుసరుసలాడింది. మొత్తానికి ఆమెలోని ప్రతిభను బాలీవుడ్ సరిగా ఉపయోగించుకోవడం లేదన్నదే రాఖీ అసహనానికి కారణమని అర్ధం చేసుకోవాలి.
News Posted: 28 August, 2009
|