బోనీ 'వాంటెడ్' 9 కరోడ్స్!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/boney-kapoor.jpg' align='right' alt=''>సల్మాన్ ఖాన్ 'వాంటెడ్' చిత్రం సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధం చేస్తున్ననిర్మాత బోనీకపూర్ కు చేదు అనుభవం ఎదురైంది. అక్షరాలా 9 కోట్ల రూపాయలు చెన్నై కోర్టులో జమ చేస్తేనే ఆ సినిమా రిలీజ్ కు మార్గం సుగమమవుతుందని కోర్టు శుక్రవారంనాడు తీర్పునిచ్చింది. అది కూడా సినిమా రిలీజ్ తేదీకి ముందే ఆ మొత్తం జమ చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బోనీ కపూర్ 2006లో ముంబైకి చెందిన ఫైనాన్సియర్ సుశీల్ గుప్తా వద్ద ఈ మొత్తాన్ని తీసుకుని సినిమా ప్రారంభించారు. అయితే బోనీ ఆ సొమ్ము తిరిగి చెల్లించకపోవడంతో సుశీల్ గుప్తా కోర్టును ఆశ్రయించారు.
బోనీ, ఆయన లాయర్లు 3 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయాలనీ, మిగతా సొమ్మును బ్యాంకు గ్యారెంటీతో చెక్కులుగా ఇవ్వాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు తీర్పు పట్ల సుశీల్ గుప్తా హర్షం వ్యక్తం చేశారు. కోర్టులో తనను ఫూల్ చేయాలని బోనీ ప్రయత్నించారనీ, అయితే తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందనీ చెప్పారు. 2006లో బోనీకి తాను అప్పు ఇచ్చినప్పుడు ఆయన తనకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారనీ, ఇది పరిశ్రమలో ఫైనాన్సియర్లు సహజంగా అనుసరించే ప్రక్రియ అనీ ఆయన తెలిపారు. అయితే శ్రీదేవి సంతాకాన్ని ఫోర్జరీ చేశాననే పాయింటుతో కోర్టులో బోనీ తన వాదన వినిపించే ప్రయత్నం చేశారనీ అన్నారు. తాను నగదురూపంలో బోనీకి అప్పు ఇచ్చినప్పుడు ఆయన సంతకం చేసిన చెక్కులు ఎందుకు తీసుకురాదో తనకు అర్థం కావడం లేదన్నారు. బోనీ, ఆయన శ్రీమతి శ్రీదేవి అంటే తనకెంతో గౌరవమనీ, గతంలో కూడా చాలా సార్లు తాను వారికి సొమ్ము ఇచ్చాననీ చెప్పారు. సొమ్ము తిరిగి ఇచ్చే సందర్భాల్లో వారికి సమస్యలు ఏర్పడినప్పుడు కూడా తాను ఎంతో కొంత మొత్తం తగ్గించి ఉపకరించాననీ తెలిపారు. సొమ్ము కోసం తాను బోనీని కోర్టుకు లాగలేదనీ, గౌరవం కాపాడుకునేందుకే ఆ పని చేశాననీ చెప్పారు. బోనీ మీదున్న నమ్మకంతోనే చెక్కులు తీసుకున్నానని వివరించారు.
News Posted: 28 August, 2009
|