'మురుగన్'పై రంభ ఫైర్!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/rambha1.jpg' align='left' alt=''>ముంబై: నటకిరీటి రాంజేంద్రప్రసాద్ 'క్విక్ గన్ మురుగన్' భారీ అంచనాల మధ్య ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారమే విడుదలైంది. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోసం ముంబైలో ఇదే రోజు జరిగిన సినిమా ప్రమోషన్ వర్క్ లో నటి రంభ పాల్గొంది. అయితే రాజేంద్రప్రసాద్ ను దగ్గరకు చేరనీయకుండా ఆయనపై గుర్రుమనడం మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ చిత్రంలో రంభ పాత్ర పేరు 'మాంగోడాలీ'. బార్ డాన్సర్. రాత్రి తన కార్యక్రమం ముగించుకున్న తర్వాత విలన్ రైస్ ప్లేట్ రెడ్డి (నాజర్) మంచం మీదకు చేరిపోతుంటుంది. అయితే మనసులో మాత్రం క్విక్ గన్ మురుగన్ ను ఇష్టపడుతుంటుంది. అయితే ఇందులో రంభ పాత్ర చాలా చిన్నదంటూ రాజేంద్రప్రసాద్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం రంభ చెవిలో ఎవరో ఊదారు. దీంతో ఆమె చిన్నబుచ్చుకుందట. పర్యవసానంగానే రంభ శుక్రవారంనాడు ఒంటరిగానే ప్రమోషన్ వర్క్ లో పాల్గొంది.
రాజేంద్రప్రసాద్ తో కలిసి పాల్గొనమంటే తాను ఒక్క క్షణం కూడా అక్కడ ఉండనంటూ నిర్మాతలకు రంభ ముందుగానే ఓ హెచ్చరిక చేసిందట. దీంతో రంభ తన ప్రమోషన్ వర్క్ ముగించుకున్న తరువాత రాజేంద్రప్రసాద్ డయాస్ మీదకు వచ్చారట. ఈ ఇగో ల మాటెలా ఉన్నా 'క్విక్ గన్ మురుగన్' పై సమీక్షకుల నుంచి మిశ్రమ స్పందనే వస్తోంది.
News Posted: 29 August, 2009
|