ఖాన్ ల మైత్రికి ఫరా దౌత్యం!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/salman-sharukh.jpg' align='right' alt=''>ఖాన్ హీరోలైన షారూక్, సల్మాన్ ల మధ్య వైరం నానాటికీ పెరిగిపోతోంది. ఆ ఒక్కరు మినహాయిస్తే బాలీవుడ్ లో తనకందరూ ఇష్టులేనంటూ ఇటీవల సల్మాన్ పరోక్షంగా షారూక్ పై నిప్పులు చెరిగాయి. అమెరికా ఎయిర్ పోర్ట్ లో ఆయన (షారూక్) విషయంలో చోటు చేసుకున్న సంఘటన మరీ అంత పెద్ద విషయం ఏమీ కాదంటూ తేలిగ్గా కొట్టేశారు. పరిశ్రమలో ఖాన్ హీరోల మధ్య రెండు వర్గాలు ఏర్పడుతుండటం ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయంలో చాలా మందే ఉన్నా వారిమధ్య సయోధ్య కుదిర్చేందుకు మాత్రం ఎవరూ సాహసించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఫరాఖాన్ అందుకు నడుం బిగించింది. ఇటు షారూక్ తోనూ, అటు సల్మాన్ తోనూ మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్న ఫరాఖాన్ ఇద్దరి మధ్యా 'శాంతి' యత్నాలు జరుపుతున్నారు.
కొరియోగ్రాఫర్ నుంచి 'ఓం శాంతి ఓం' చిత్రంలో దర్శకురాలిగా మారిన ఫరాఖాన్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ 'వారిద్దరూ నాకెంతో ఇష్టులు. వారిద్దరినీ మళ్లీ కలపాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. ఇందులో భాగంగానే 'తేరే మేరే బీచ్ మే' అనే ఛాట్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఫరా ఆ ప్రోగ్రాం తొలి సెలబ్రెటీ గెస్ట్ లుగా సల్మాన్, ఆయన తల్లిని రప్పించారు. చివరి ఎపిసోడ్ లో షారూక్ ఖాన్ ను రప్పించాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడూ ఛాట్ షోలకు రాని సల్మాన్ ను 'తేరే మేరే..' కోసం రప్పించగలిగామనీ, చివరి వరకూ ప్రేక్షకులు ఎదురుచూసేలా చేయడం కోసం చాట్ షో చివర్లో షారూక్ ను రప్పిస్తామనీ ఫరా తెలిపింది. ఆసక్తికరంగా ఈ ఛాట్ షో నిర్మాతల్లో షారూక్ కూడా ఒకరు. షారూక్-సల్మాన్ ల మధ్య దాదాపు ఏడాదిగా మాటలు లేవు. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ బర్త్ డే పార్టీలో ఖాన్ హీరోల మధ్య గొడవ జరిగినప్పటి నుంచి పరిస్థితి విషమిస్తూ వచ్చింది. అంతకుముందు వరకూ ఈ ఇద్దరి ఖాన్ ల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఉండేది. 1995లో విజయవంతమైన 'కరణ్ అర్జున్'లో చివరిసారిగా ఈ ఇద్దరూ కలిసి నటించారు.
News Posted: 31 August, 2009
|