పెళ్లి ఈ ఏడాది కాదు: శిల్ప
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/silpa1.jpg' align='right' alt=''>లండన్ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాతో తన వివాహం ఈ ఏడాది ఉండదని నటి శిల్పాశెట్టి వివరణ ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ లోనే శిల్పా పెళ్లి చేసుకోనుందంటూ వస్తున్న తాజా వార్తలపై శిల్ప ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఆమె తన బ్లాగ్ లో వివరణ ఇచ్చింది.
'ఇంతకు ముందు చెప్పినట్టే అమ్మానాన్నలు పెళ్లి ముహూర్తం నిశ్చయించిన వెంటనే పబ్లిక్ గా ఆ విషయాన్ని ప్రకటిస్తాను. పెళ్లికి నెలరోజుల ముందే మీడియాకు తెలియజేస్తాను. సూటిగా చెప్పాలంటే ఈ ఏడాది మాత్రం పెళ్లి ఉండదు. వచ్చే ఏడాది జరుగుతుంది. ఏరోజనేది ఇంకా అనుకోలేదు' అని శిల్ప చెప్పుకొచ్చింది. శిల్ప తల్లిందండ్రులైన సురేంద్ర శెట్టి, సునంద ఇటీవల తమ పాస్ పోర్టుల కోసం సూరత్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవడం, శిల్ప పెళ్లికి హాజరయ్యేందుకు వీలుగా తమ పాస్ పోర్ట్ లు ఇప్పించాలని వారు కోర్టుకు నివేదించడం బయటకు పొక్కింది. దీంతో ఈ డిసెంబర్ లోనే శిల్ప పెళ్లి జరగనుందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై శిల్ప స్పందిస్తూ, బ్రేకింగ్ న్యూస్ పేరుతో కొన్ని ఛానెల్స్ వార్తలు ప్రసారం చేస్తుండటం, పత్రికలు రీమ్ ల కొద్దీ న్యూస్ పేపర్ ను వృథా చేస్తుండటం, ఇవి చూసి తనను పలువురు ప్రశ్నించడం తనకు చాలా ఇబ్బందిగా ఉందని తెలిపింది. తన తండ్రి విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడల్లా చాలా ఇబ్బందులు పడుతుండటం తనను బాధిస్తోందనీ, ఆయన 67 ఏళ్ల వయోవృద్ధుడనీ, ఆయనను ప్రశాంతంగా ఉంచమని కోరుకుంటున్నాననీ శిల్ప పేర్కొంది. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలనీ, ఊహానాలు, నిరాధార వార్తలతో ఇబ్బంది పెట్టవద్దనీ ఆమె విజ్ఞప్తి చేసింది.
News Posted: 1 September, 2009
|