'ఐష్'కు ఆస్కార్ మేకప్ మన్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/aishwarya-rai1.jpg' align='right' alt=''>మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఇప్పుడు 'యాక్షన్ రీప్లే' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇందులో అక్షయ్ కుమార్ హీరో. విపుల్ షా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఐష్, అక్షయ్ ల గెటప్ విలక్షణంగా ఉండబోతోంది. తాను అనుకున్న లుక్ కోసం ఆస్కార్ ఆవార్డు విజేత, హాలీవుడ్ మేకప్ మన్ పాల్ పట్టిసన్ ను విపుల్ షా రప్పించబోతున్నారు.
విపుల్ షా ప్రయత్నాల వరకూ ఎలాంటి లోటు లేకపోయినా ఐశ్వర్య-అక్షయ్ జోడీని, పాల్ పట్టిసన్ నూ ఒకేచోట చేర్చేందుకు మాత్రం కష్టతరంగా మారిందట. మణిరత్నం 'రావణ్' చిత్రంలో ఐశ్వర్య బిజీగా ఉంది. మరోవైపు పట్టిసన్ సైతం 'చికానే', 'ది వెయిటింగ్ సిటీ' అనే రెండు హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అనూహ్యంగా 'రావణ్' చిత్రం షూటింగ్ నుంచి ఐశ్వర్యకు ఇప్పుడు కొంత విశ్రాంతి దొరికింది. దీంతో పట్టసన్ పని చేస్తున్న హాలీవుడ్ సినిమా నిర్మాతను విపుల్ షా కాంటాక్స్ చేసి, తన సినిమా కోసం కొద్దిరోజులు పట్టిసన్ ను పంపిచాలని కోరినట్టు సమాచారం. అందుకు సదరు నిర్మాత సైతం సుముఖత వ్యక్తం చేశారట. హాలీవుడ్ మేకప్ మన్ చేతిలో ఐశ్వర్య న్యూ గెటప్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు అందర్నీ ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తోంది.
News Posted: 1 September, 2009
|