దియా పెదాలపై ఇర్ఫాన్ కాటు!
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన ఇర్ఫాన్ ఖాన్ కు ప్రతిభావంతుడైన నటుడనే పేరుంది. ఏ పాత్ర ఇచ్చినా పరకాయప్రవేశం చేయడం, అందరి మెప్పుపొందడం ఆయనకు రివాజే. పెర్ ఫెక్షన్ కోసం ఆయన పడే తాపత్రయం ఇప్పుడు ఓ ఆసక్తికరమైన సంఘటనకు దారితీసింది. 'యాసిడ్ టెస్ట్' అనే చిత్రం షూటింగ్ ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగినప్పుడు ఇర్ఫాన్ తన కో-స్టార్ దియామీర్జా పెదాలపై పెదాలు కలిపి ఘాటైన ముద్దు లాగించేశాడు. నిజానికి ఆ సన్నివేశంలో దియా బుగ్గలమీదే ఇర్ఫాన్ ముద్దు పెట్టుకోవాల్సి ఉంది. స్క్రిప్టులో ఆ విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ ఇర్ఫాన్ దియా పెదాలపై ముద్దుపెట్టుకోవడం ఇటు దియాతో పాటు అటు యూనిట్ సభ్యులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దెబ్బతిన్న దియా ఆ విషయాన్ని నిర్మాత సంజయ్ గుప్తాకు ఫోన్ లో మొరపెట్టుకుందట.
ఇర్ఫాన్ ను ఫర్దీన్ ఖాన్ కు దియా పరిచయం చేయాల్సిన ఘట్టమది. ఇర్ఫాన్ దియా బుగ్గపై ముద్దుపెట్టుకునేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. సన్నివేశం ఇలా ఉండగా ఇర్ఫాన్ నేరుగా దియా పెదాలపై ముద్దుపెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 'లిప్ కిస్' సన్నివేశం స్క్రిప్టులో లేని మాట నిజమేననీ, అయితే ఆ సంఘటనపై ఎవరూ రాద్దాంతం చేయకుండా ఆ తర్వాతే సంజయ్ కు
చెప్పాలనుకున్నారనీ యూనిట్ వర్గాలు తెలిపాయి. దియా సైతం ఈ విషయాన్ని స్పోర్టివ్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇర్ఫాన్ చర్య తనకు ఆశ్చర్యం కలిగించినా, ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగుండాలనే ఉద్దేశంతోనే ఆయన అలా చేసి ఉండవచ్చని దియా చెప్పుకొచ్చింది. రియాలిటీకి దగ్గరగా సన్నివేశం ఉండాలని ఇర్ఫాన్ భావించినట్టు కనిపిస్తోందనీ, రషెస్ చూసిన తర్వాత ఇర్ఫాన్ ఆలోచన సబబుగానే తోచిందనీ సంజయ్ పేర్కొన్నారు. మొత్తానికి ఇర్ఫాన్ 'దూకుడు' చూపించినా దియా హుందాగా వ్యవహరించడం మెచ్చుకోలైన విషయమే.
News Posted: 1 September, 2009
|