గిన్నెస్ రికార్డుకు ప్రియాంక
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/priyanka-chopra2.jpg' align='right' alt=''>బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కష్టం ఫలిచింది. ఇప్పుడు ఆమె గిన్నెస్ రికార్డులో కూడా చోటు చేసుకోనుంది. ఒకే సినిమాలో అత్యధిక పాత్రలు పోషించడం ద్వారా ఈ రికార్డును ఆమె సొంతం చేసుకోనున్నారు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా 'వాట్స్ యువర్ రాశి' చిత్రంలో ప్రియాంక 12 పాత్రలు పోషించింది. ప్రియాంక పేరును గిన్నెస్ రికార్డుకు చిత్ర నిర్మాత సునీత గోవారికర్ పంపారు.
గిన్నెస్ రికార్డులో తన పేరు చోటుచేసుకుంటే అంతకంటే అద్భుతమైన విషయం మరొకటి ఉండదని ప్రియాంక ఎంతో ఉద్వేగంతో చెప్పింది. 'వాట్స్ యువర్ రాశి' వంటి రికార్డ్ బ్రేకింగ్ చిత్రంలో పనిచేయడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొంది. ఈ సంతోషాన్ని సునీతా గోవారికర్ పంచుకుంటూ, ప్రియాంక ఈ చిత్రంలో 12 పాత్రలు పోషించడమే గాకుండా ఒక పాత్రతో మరొక పాత్రకు పోలికలు ఉండవనీ, ఎవరో కొద్దిమంది మాత్రమే ఇలాంటి పాత్రలను ఛాలెంజ్ గా తీసుకుని నటిస్తారనీ చెప్పారు. గిన్నెస్ అధికారలకు తాము ఈ విషయం చెప్పినప్పుడు వారు ఎంతో విస్మయం వ్యక్తం చేశారనీ, ఏ భాషా చిత్రంలోనూ ఇన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించిన దాఖలాలు లేవనీ, నిశ్చయంగా ఇది ప్రపంచ రికార్డేననీ సునిత గోవాకరికర్ తెలిపారు.
News Posted: 2 September, 2009
|