సంజూ ఒంటిపై తొమ్మిదో టట్టూ!
నీడిల్ కూ సంజయ్ దత్ కూ అవినాభావ సంబంధం ఉంది. ఒకప్పుడు మత్తుపదార్ధాలకు బానిసైన సంజూ బాబాకు అప్పట్లో నీడిల్ అవసరం ఎక్కువగా ఉండేది. ఆ అలవాటు నుంచి ఆయన బయట పడినప్పటికీ 'టట్టూ నీడిల్స్' అంటే ఇప్పటికీ ఆయన ప్రాణం పెట్టేస్తుంటారు. ఆదివారం ఉదయం ఆయన ఎరుపురంగు స్పోర్ట్ కారులో బాంద్రాలోని అలీం హకీమ్ స్టూడియోకు చేరుకుని తన శరీరంపై 9వ పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఇప్పటికే వీపు వెనుక భాగంలో నాలుగు, ఛాతీపై రెండు, మోచేయి కింది భాగంలో రెండు టట్టూలు వేయించుకున్నారు. తాజాగా ఆయన మోచేయి పైభాగంలో సమురాయ్ పచ్చొబొట్టు వేయుంచుకున్నారు. ప్రతిసారి ఆయన తన అభిరుచికి అనుగుణంగానే టట్టూలు వేయించుకుంటూ ఉంటారు.
'టట్టూ నీడిల్స్ కు ఎడిక్ట్ అయిన మాట నిజం. ఉల్లాసంగా అనిపించిన ప్రతిసారీ నాకు రెగ్యులర్ గా టట్టూలు వేసే విశ్వాస్ ను పిలిపించి నీడిల్స్ రెడీ చేయమని చెప్పేస్తుంటాను' అంటూ సంజూ బాబా నవ్వుతూ చెప్పారు. స్లీవ్ లెస్ జాకెట్, ఆరెంజ్ కలర్ ట్రాక్ ఫ్యాంట్ తో ఎంతో గ్లామర్ గా కనిపించిన సంజయ్ అదే ఉత్సాహంతో ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. ఆ మరుసటి రోజే 'బ్లూ', 'ఆల్ ది బెస్ట్' చిత్రానికి డబ్బింగ్ చెప్పాల్సి ఉన్నప్పటికీ ఏమాత్రం అలసట తెలయని చిన్నపిల్లాడిలా సంబరపడుతూ టట్టూ వేయించుకోవడం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. బాలీవుడ్ లో చక్కటి దేహదారుఢ్యం ఉన్న వారిలో బాబా ఒకరనీ, ఈ టట్టూలు ఆయన పెర్సనాలిటీకి వెన్నె తెచ్చేవి మాత్రమేననీ స్లైలిష్ట్ అలీమ్ వ్యాఖ్యానించారు.
News Posted: 2 September, 2009
|