కమల్ గొంతు శ్రుతి!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kamal-sruti.jpg' align='right' alt='Kamal-Shruti'>కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హసన్ కు ఎదుట వ్యక్తులను ఒప్పించే సామర్థ్యం పుష్కలంగానే ఉన్నట్టుంది. కమల్ 'ఉన్నైపోల్ ఒరవన్' చిత్రంతో తొలిసారి సంగీత దర్శకురాలైన శృతి అదే చిత్రం కోసం తన తండ్రి గొంతును కూడా శ్రుతి చేసింది. కమల్ ను ఒప్పించి రెండు పాటలు కూడా పాడించింది. కమల్ గాయకుడిగా అవతారం ఎత్తడం ఇది మొదటిసారి కానప్పటికీ, తన కూతురు కోసమే మరోసారి గొంతు సవరించుకుని ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
హిందీలో విజయవంతమైన 'ఎ వెన్స్ డే' చిత్రానికి రీమేక్ గా 'ఉన్నైపోల్ ఒరువన్' చిత్రం రూపొందుతోంది. ఇదే చిత్రం తెలుగులో 'ఈనాడు' పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. చక్రి తోలేటి ఈ ద్విభాషా చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. ఇందులో కమల్ పాడినట్టు చెబుతున్న రెండు పాటలు చెన్నైలోని కోదండపాణి రికార్డింగ్ థియేటర్ లో (ప్రముఖ గాయకుడు ఎస్.బి.బాలసుబ్రమణ్యం సొంత థియేటర్) రికార్డింగ్ చేశారు. ఇందులో ఒకటి సూపీ సాంగ్ కాగా మరొకటి రాక్ సాంగ్ అని తెలుస్తోంది. ఆసక్తికరంగా ఈ చిత్రానికి చెందిన ప్రమోషనల్ వీడియోకు కమల్ చిన్నకూతురు అక్షర కొరియోగ్రఫీ అందించారు. తండ్రీకూతుళ్లు కలిసి పనిచేస్తుండటం కమల్ అభిమానులకు ట్రిపుల్ ట్రీటే. ఈనెల 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
News Posted: 2 September, 2009
|