'మైనేమ్ ఈజ్ ఖాన్' వెలెంత?
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/mynameiskhan1.jpg' align='right' alt=''>బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, అందాల నటి కాజల్ జంటగా కరణ్ జోహర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో ప్రముఖంగానే ఉంటోంది. హాలీవుడ్ కు చెందిన ఫాక్స్ స్టూడియో 100 కోట్ల రూపాయలకు ఈ చిత్రం మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ (మ్యూజిక్ హక్కులు మినహా) హక్కులను ఎగరేసుకుపోయిందనే వార్త ఇటీవల సంచనలం సృష్టించింది. గ్లోబల్ డీల్ పరంగా ఇదే అత్యుత్తమ రికార్డుగా ప్రచారం జరిగింది. అయితే ఈ డీల్ 100 కోట్లు కాదనీ, 81 కోట్లు కావచ్చనీ ఇప్పుడు బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇతమిద్ధమైన అంకె మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది.
'కరణ్, షారూక్ లతో భాగస్వామ్యం పంచుకోవాలనుకోవాలి ఎవరైకైనా ఉంటుంది. సినిమా గ్లోబల్ రైట్స్ పూర్తిగా 100 కోట్లు కాదు...81 కోట్లు కూడా కాదు. సరైన అంకె ఏమిటనేది మాత్రం వెల్లడించేది లేదు' అని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఇండియా సిఇవో విజయ్ సింగ్ తెలిపారు.
అయితే సినిమా చాలా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ మార్కెట్ లో రిలీజ్ అవుతుందనే విషయాన్ని ఆయన ధ్రువీకరిస్తూ 'ఇంటర్నేషనల్ అప్పీల్ ఉన్న సినిమా ఇది. అమెరికాలో ఫాక్స్ సెర్చిలైట్, ప్రపంచవ్యాప్తంగా ట్వంటీయత్ ఫాక్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. మొదట్లో మరీ ఎక్కువ ప్రింట్లు ఉండకపోవచ్చు. అమెరికాలో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం 10 స్క్రీన్ లతో ప్రారంభమై క్రమంగా 3000 వరకూ పెరిగింది. మైనేమ్ ఈజ్ ఖాన్ చిత్రం విషయంలోనూ ఇదే స్ట్రాటజీని పాటించే అవకాశాలున్నాయి' అని విజయ్ సింగ్ వెల్లడించారు.
News Posted: 2 September, 2009
|