జర్నలిస్టుగా కంగన
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kangana6.jpg' align='left' alt=''>నటిగా పలు ఛాలెంజింగ్ పాత్రలు పోషించిన కంగనా రనౌత్ తన తదుపరి చిత్రంలో డేరింగ్ జర్నలిస్టు పాత్ర పోషించబోతోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి మణిశంకర్ దర్శకుడు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ లో పనిచేసే టాప్ జర్నలిస్టుగా కంగనా నటించనుందనీ, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ బర్ఖా దత్ పోలికలతో ఆమె పాత్ర ఉంటుందనీ తెలుస్తోంది.
'కంగనా తొలిసారి జర్నలిస్టు పాత్ర పోషించనుండటంతో చాలా ఎగ్జయింటింగ్ గా ఉంది. సంజయ్ దత్, ఇర్ఫాన్ ఖాన్ లు ప్రభుత్వ ఏజెంట్లుగా కీలక పాత్రలను పోషించబోతున్నారు. ప్రయోగాత్మక పాత్రలు పోషించడంలో కంగనా కు మంచి పేరుంది. అలాగే మంచి ఫ్యాషన్ సెన్స్ కూడా ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో ఆమె చాలా కొత్త లుక్ తో కనిపించబోతోంది. రెగ్యులర్ గా కంగనా కనిపించే కర్లింగ్ హెయిర్ కు బదులు బర్ఖా దత్ తరహాలో కురచ హెయిర్ స్టయిల్ లో కనిపిస్తుంది' అని సినీ వర్గాలు చెబుతున్నాయి. కంగన పాత్ర, ఆమె న్యూ లుక్ పై వ్యాఖ్యానించేందుకు నిర్మాత సోహైల్ మకలాయ్ నిరాకరించారు. దీనిపై కంగనా ఇంకా స్పందించవలసి ఉంది.
News Posted: 2 September, 2009
|