ప్రకాష్ రాజ్ కు జాతీయ అవార్డు
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kanchivaram.jpg' align='right' alt=''>దక్షిణాది చిత్రాల విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ 2008వ సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైనట్టు తెలుస్తోంది. 'కాంచీవరం' (తమిళం) చిత్రంలో అత్యుత్తమ నటన ప్రదర్శించినందుకు గాను ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారు. దీనితో పాటు 'కాంచీవరం' ఉత్తమ చిత్రం అవార్డును, ఆ చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ జాతీయ అవార్డులను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అంబికా సోని ప్రకటించాల్సి ఉంది.
మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నట్టు తెలుస్తున్న 'కాంచీవరం'ను ఆఫ్ బీట్ చిత్రంగా దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించారు. పెర్ సెప్ట్ పిక్చర్స్ కంపెనీ, గుల్షన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు కాంచీపురంలో చేనేత కార్మికల దుస్థితిని తెలియజేసే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఫామ్ స్ర్పింగ్స్ ఇంటర్నేషనల్ ఫిల్స్ ఫెస్టివల్, టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2008 తో సహా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
News Posted: 4 September, 2009
|