కరణ్ డ్రెస్ కలెక్షన్...
కరణ్ జోహర్ కు మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంది. షారూక్ ఖాన్ తో సహా పలువురు స్టార్ హీరోలకు ఆయనే స్వయంగా డ్రెస్ డిజైన్ చేస్తుంటారు. చివరకు తన దుస్తుల విషయంలోనూ ఆయన ఇదే విధానం ఫాలో అవుతుంటారు. తన వద్ద లెక్కకు మించిన దుస్తులు ఉన్నాయనీ, వాటికి ప్లేస్ కల్పించాలంటే ప్రత్యేకంగా ఓ అపార్ట్ మెంట్ కావాల్సిందేననీ ఆయన చమత్కరిస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆయన కొద్దికాలంగా కొత్త అపార్ట్ మెంట్ కొనే పనిలో కూడా ఉన్నారు.
కరణ్ కు దుస్తుల మీదున్న మమకారం ఎలాంటిదంటే ఆయన వద్ద అన్ని సైజుల్లోనూ జీన్స్, షర్ట్ లు ఉన్నాయి. ఒకనాటికి తాను కూడా బాగా ఒళ్లు చేయవచ్చనే ముందుచూపే ఇందుకు కారణమని ఆయన చెబుతుంటారు. 'ఇప్పటికే నేను బాగా ఒళ్లు చేశాను' అంటుంటారు. ఆయన అభిరుచి ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. వరుణ్ బెహల్ తో కలిసి ఆయన సొంతంగా క్లోతింగ్ లైన్ లోకి కూడా అడుగుపెడుతున్నారు. అక్టోబర్ 16న 'మెన్స్ వేర్ కలెక్షన్' సెంటర్ ను ముంబై లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని కరణ్ ధ్రువీకరించారు. వరుణ్ బెహల్ తో కలిసి ఈ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు ఆయన తెలిపారు. పన్నెండేళ్లుగా షారూక్ ఖాన్ కు తాను డిజైనింగ్ చేస్తున్నాననీ, తాను ఏర్పాటు చేసే మెన్స్ వేర్ కలెక్షన్ సెంటర్ కు 'కరణ్ జోహర్ విత్ వరుణ్ బెహల్' అనే పేరు అనుకుంటున్నామనీ చెప్పారు.
News Posted: 4 September, 2009
|