చోప్రా..ది బెస్ట్ ఫిల్మ్ మేకర్
యష్ రాజ్ ఫిలిమ్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ దర్శక నిర్మాత యష్ చోప్రాకు ప్రతిష్ఠాత్మక 'ఆసియన్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రకటించారు. బాలీవుడ్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును 14వ పుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్ట్ ఫెస్టివల్ లో ప్రదానం చేయనున్నారు. సౌత్ కొరియాలోని పుసాన్ లో అక్టోబర్ 8 నుంచి 16 వరకూ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనుంది.
హిందీ చిత్ర పరిశ్రమలో కింగ్ ఆఫ్ రొమాన్స్ గా గుర్తింపు పొందిన చోప్రా (76) ఐదు దశాబ్దాలుగా ఇండియన్ ఫిలిమ్స్ స్థాయిని గ్లోబల్ స్థాయికి విస్తరించడంలో విశేష కృషి చేస్తున్నారు. హాలీవుడ్ సహభాగస్వామ్యంతో ఇండియన్ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో చోప్రా చేస్తున్న కృషి ఆసామాన్యమైనదనీ, అందుకు గుర్తింపుగానే ఆయనను 'ఆసియన్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపిక చేశామనీ పుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. చోప్రా తీసిన 'లమ్హే', 'ధూమ్-2', 'రబ్ నే బనాది జోడీ', 'న్యూయార్క్' వంటి పలు చిత్రాలను కూడా ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు.
News Posted: 4 September, 2009
|