వివేక్ తో నటించను: కత్రిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ప్రభావం ఆమె ప్రియురాలు కత్రినా కైఫ్ పై కూడా బలంగానే కనిపిస్తోంది. వివేక్ ఒబెరాయ్ తో నటించేందికి లేదని తెగేసి చెబుతోంది. కత్రినా స్టేట్ మెంట్ కంటే ముందే వివేక్ పై సల్మాన్ గతవారంలో విరుచుకుపడ్డారు. ఐశ్వర్యారాయ్ విషయంలో సల్మాన్ కూ, వివేక్ ఒబరాయ్ కూ మధ్య గొడవ జరిగింది. ఆ సందర్భంలో వివేక్ వ్యవహరించిన తీరు, సల్మాన్ కు వ్యతిరేకంగా అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సల్మాన్ మరిచిపోలేదు. ఇందుకు నిదర్శనంగానే వివేక్ ను 'ఐడియట్' అంటూ సల్మాన్ ఇటీవల ఘాటుగానే విమర్శించారు. కత్రినా కైఫ్ ఆ 'ఇడియట్'తో నటించడానికి తాను ఇష్టపడననీ, ఇంకే స్టార్ హీరోతో నటించినా తనకు అభ్యంతరం లేదనీ నిష్కర్షగా ఆయన తేల్చిచెప్పారు. దీనికి కొనసాగింపుగా కత్రినా సైతం వివేక్ తో నటించేందుకు సిద్ధంగా లేనని తాజాగా స్పష్టం చేసింది.
సల్మాన్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా అని కత్రినాను అడిగినప్పుడు 'ఎంతమాత్రం కాదు. ఇది నా సొంత నిర్ణయమే' అని ఆమె చురుగ్గా సమాధానమిచ్చింది. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే సల్మాన్ సెక్రటరీ ఫోన్ నెంబర్ ఇస్తాననీ, ఆయన్నే అడిగి తెలుసుకోవచ్చనీ చెప్పుకొచ్చింది. 'న్యూయార్క్' చిత్రం సాధించిన సక్సెస్ సంబరంలో ఉన్న సల్మాన్ ప్రస్తుతం ప్రకాష్ ఝా 'రాజ్ నీతి' చిత్రం కోసం భోపాల్ లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటోంది. ఇందులో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.
News Posted: 8 September, 2009
|