కమల్ పై కోర్టుకెక్కిన పిరమిడ్ చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ 'మర్మయోగి' చిత్రానికి పారితోషికం తీసుకుని కూడా ఆ చిత్రాన్ని పూర్తి చేయలేదంటూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ పిరిమిడ్ సాయిమిరా కోర్టును ఆశ్రయించింది.
సుమారు ఏడాది క్రితం 'మర్మయోగి' చిత్రం కోసం పిరమిడ్ సాయిమిరా సంస్థ కమల్ కు 10.90 కోట్ల పారితోషికాన్ని చెల్లించినట్టు సమాచారం. కారణాంతరాల వల్ల ఆ చిత్రం సెట్స్ కు రాకుండానే ఆగిపోయింది. 'మర్మయోగి' చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాతే మరో సినిమా చేస్తానని కమల్ తమకు హామీ ఇచ్చి మాట తప్పారనీ, యూటీవీ ఇంటర్నేషన్ లో కలిసి తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఎంటర్ టైనర్ బ్యానర్ పై 'ఉన్నైపోల్ ఒరువన్' (తెలుగులో 'ఈనాడు') చిత్రంలో నటించి విడుదలకు సిద్ధం చేశారని పిరమిడ్ సాయిమిరా సంస్థ తన వాదన వినిపించింది. 'ఉన్నైపోల్ ఒరువన్' సినిమా రిలీజ్ కు కమల్ సన్నద్ధం కావడం అనుచితమనీ, తీసుకున్న అడ్వాన్ తిరిగి చెల్లించాల్సిందేననీ సంస్థ అధికర ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
News Posted: 9 September, 2009
|