కరీనా పేరుతో పిజ్జా పిజ్జా పేరు చెబితే చాలామందికి నోరూరుతుంది. యువతీ యువకుల ఇష్టాఇష్టాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పిజ్జా కార్నర్ లు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. తాజాగా ఇంటర్నేషన్ పిజ్జా చైన్ సెంటర్ ఒకటి కరీనా అభిమానులను దృష్టిలో పెట్టుకుని 'సైజ్ జీరో' అనే పిజ్జాను ప్రవేశపెట్టింది. న్యూఢిల్లీలోని కరీనా అభిమానులను ఇప్పుడు లొట్టసేసుకుంటూ ఈ పిజ్జాను లాగించేస్తున్నారు. ఈ పిజ్జా వ్యవహారం ఢిల్లీలోనే ఉంటున్న కరీనా చెల్లెలు కరిష్మాకపూర్ ద్వారా కరీనాకు తెలిసింది. విదేశాల్లో షూటింగ్ షెడ్యూల్స్ తో పాల్గొని ఓ ఐదు రోజుల క్రితమే ముంబై వచ్చిన కరీనా ఈ విషయం తెలిసి ఎంతో థ్రిల్ అయిపోతోంది.
వ్యక్తిగతంగా కూడా పిజ్జాలంటే కరీనా ప్రాణం పెట్టేస్తుంటుంది. ఔట్ డోర్ షూటింగ్స్ లో ఉన్నప్పుడు ఆమె తల్లి స్వయంగా ముంబై నుంచి పిజ్జాలు తీసుకుని వెళ్లి ఇస్తుంటుంది. ఇప్పుడు ఏకంగా తన పేరుతో ఓ పిజ్జా మార్కెట్ లోకి రావడంతో కరీనా తెగ సంబరపడుతోంది. 'ఇటాలియన్ ఫుడ్ అంటే నాకెంతో ఇష్టం. వారానికి కనీసం రెండుసార్లయినా పిజ్జా తినకుండా ఉండలేను. ఇప్పుడు నా పేరుతోనే పిజ్జా రావడం చాలా థ్లిల్లింగ్ గా ఉంది' అంటోంది కరీనా. అయితే తాను ఇంకెంతమాత్రం 'సైజ్ జీరో' ఆహార్యంతో కనిపించబోవడం లేదనీ, కరణ్ జోహర్ తీస్తున్న స్టెప్ మామ్ హిందీ వెర్షన్ కోసం తాను కొద్దిగా లావుగా కనిపించాల్సి ఉందనీ ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఆ మాటెలా ఉన్నా ప్రస్తుతం కరీనా అభిమానులు మాత్రం సైజ్ జీరో పిజ్జాల కోసం
ఎగబడుతున్నారు.
News Posted: 10 September, 2009
|