మండోదరిగా బిపాసా
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/bipasa2.jpg' align='right' alt=''>ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించే అవకాశం రావడమే ఓ అదృష్టంగా నటీనటులు ఎదురుచూస్తుంటారు. హిందీ, తమిళ భాషల్లో కొద్దికాలంగా మణిరత్నం తెరకెక్కిస్తున్న 'రావణ్' చిత్రానికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. అయినప్పటికీ అడపా దడపా కీలక సమాచారం బయటుకు వస్తూనే ఉంది. అభిషేక్, ఐశ్వర్యారాయ్, విక్రమ్ ప్రధాన పాత్రల్లో చిత్రం రూపొందుతోంది. మోడ్రన్ రామాయణం నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో శూర్పణక తరహా పాత్రను ప్రియమణి పోషిస్తుండగా, కొద్దికాలంగా మణిరత్నం అన్వేషిస్తున్న మండోదరి పాత్రకు సెక్సిణి బిపాసాబసు ఎంపికైంది.
తొలుత మండోదరి పాత్రకు నయనతారను శ్రీమతి సుహాసిని మణిరత్నం సంప్రదించారట. అయితే అందులో తన పాత్రకు పెద్ద ప్రాధాన్యం ఉండదని భావించిన నయనతార డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదంటూ తిరస్కరించిందట. ఆ తర్వాత సుస్మితాసేన్ ను సంప్రదించినా ఐశ్వర్య ఉన్న సినిమాలో నటించడానికి ఆమె ఇష్టపడలేదట. దీంతో బిపాసాను సంప్రదించడం, ఆమె మరోమాటకు తావులేకుండా ఆ అవకాశం అందిపుచ్చుకోవడం జరిగింది. రావణుని భార్య మండోదరి మహా అందగెత్తగా పురాణాలు వర్ణిస్తుంటాయి. అలాంటి అందగత్తె పాత్ర రావడంతో బిపాసా పచ్చ జెండా ఊపారట. ఈ పాత్ర నిడివి 40 నిమిషాల వరకు ఉంటుందనీ, 20 రోజుల పాటు బిపాసా షూటింగ్ లో పాల్గొంటారనీ తెలుస్తోంది. అయితే బిపాసా పాత్ర స్వరూప స్వభావాలు ఎవరికీ చెప్పరాదంటూ మణిరత్నం ఆమెపై ఆంక్షలు విధించారట.
News Posted: 11 September, 2009
|