హానరరీ ప్రొఫెసర్ గా షారూక్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/shahrukh4.jpg' align='right' alt=''>బ్రిటన్ లోని బెడ్ ఫోర్డ్ షైర్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న బాలీవుడ్ బాద్ షా ఇప్పుడు హానరరీ ప్రొఫెసర్ గా కూడా అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు. షారూక్ ను గౌరవ డాక్టరేట్ కు ఎంపిక చేసిన ఎన్జీవో 'రూట్స్ టు రూట్స్ ' ఇప్పుడు లండన్ లోని కోవెంట్రీ యూనివర్శిటీ ప్రొఫెసర్ షిప్ కోసం షారూక్ ను ఎంపిక చేయనుంది.
షారూక్ కు గౌరవ ప్రొఫెసర్ హానర్ ఇవ్వనున్న విషయాన్ని రూట్స్ టు రూట్స్ సెక్రటరీ రాకేష్ గుప్తా ధ్రువీకరించారు. షారూక్ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నారనీ, చీకట్లో మగ్గే రాజస్థాన్, ఒరిస్సాలోని పలు గ్రామాల్లో విద్యుత్ వెలుగులు నింపుతున్నారనీ ఆయన తెలిపారు. ఆయా గ్రామాల్లో చాలామందికి షారూక్ గురించి తెలియదనీ, కరెంట్ లేకపోవడం వల్ల సినిమాలు చూసే అవకాశాలు కూడా వారికి లేవనీ ఆయన అన్నారు. ఒరిస్సాలోని అహిరాజ్ పూర్ కుగ్రామంలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే 'ద ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్'కు షారూక్ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలే ఇప్పుడు లండన్ వర్శిటీ గౌరవ ప్రొఫెసర్ హానర్ కు కింగ్ షారూక్ ను అర్హుని చేసింది.
News Posted: 14 September, 2009
|