భరించే భర్త కావాలి
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/sushmita-sen1.jpg' align='right' alt=''>మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ చాలాకాలం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుస్మితా సేన్ నటించిన 'డు నాట్ డిస్ట్రబ్' చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బిగ్ పిక్చర్స్, వసు భగ్నాని సంయుక్త భాగస్వామ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గోవింద, రితీష్ దేశ్ ముఖ్, లారాదత్తా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తన అభిమానులను ఎంతగానో అలరిస్తుందని సుస్మిత చెబుతోంది.
'ప్రస్తుతం నా జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది. అభిమానులు నన్ను మరిన్ని సినిమాల్లో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు తగ్గట్టే ఇక నుంచి పూర్తి కమర్షియల్ చిత్రాల్లో మాత్రమే నటించదలచుకున్నాను. ఇతరత్రా సినిమాల్లో నటించి విలువైన సమయాన్ని వృథా చేయదలచుకోలేదు' అంటూ కెరీర్ నూ, తన కొత్త నిర్ణయాలను సుస్మిత చెబుతోంది. సుస్మితా పెంపుడు కూతురు రెనీ కూడా ఇప్పుడు పదో ఏట అడుగుపెట్టింది. సుస్మిత సైతం 33వ పడిలో పడింది. మరి పెళ్లిమాట ఎపుడు చెబుతావు సుస్మితా అని నడిగితే, 'ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదు. నన్ను భరించ గలిగే భర్త దొరికితే అప్పుడు తప్పనిసరిగా ఆలోచిస్తాను' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది.
News Posted: 14 September, 2009
|