హిందీ 'మగధీర' హృతిక్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/hrithik8.jpg' align='left' alt=''>బాలీవుడ్ లో దక్షిణాది చిత్రాల రీమేక్ జోరు పెరుగుతోంది. ఈమధ్యనే హిందీ రీమేక్ గా అమీర్ ఖాన్ నటించిన 'గజనీ' సంచలన విజయం సాధించడంతో పలువురు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టి దక్షిణాది సినిమాలపై పడింది. స్టార్ హీరోలు సైతం దక్షిణాదిలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాల్లో నటించేందుకు తహతహలాడుతున్నారు. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ దృష్టి ఇప్పుడు టాలీవుడ్ లో సంచనల రికార్డులు సృష్టిస్తున్న 'మగధీర' చిత్రంపై పడింది.
రామ్ చరణ్ కథానాయకుడుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన 'మగధీర' చిత్రం ఈనెల 18వ తేదీతో 50 రోజులకు చేరుకోనుంది. ఇంతవరకూ 52 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో హిందీ రీమేక్ కు కూడా నిర్మాత అల్లు అరవింద్ హిం సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తికరంగా 'గజనీ' రీమేక్ నిర్మాత కూడా ఆయనే. అల్లు అరవింద్ ఆఫర్ ను హృతిక్ రోషన్ మరోమాటకు తావు లేకుండా అంగీకరించారనీ, తెలుగు వెర్షన్ లో శ్రీహరి నటించిన షేర్ ఖాన్ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ను సంప్రదిస్తున్నారనీ సినీ వర్గాల భోగట్టా. అలాగే దర్శకుడుగా రాజమౌళినే ఖరారు చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే రాజమౌళికి ఇది తొలి బాలీవుడ్ చిత్రం అవుతుంది. ఇతర నటీనటులు, సాంకేతక నిపుణుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది.
News Posted: 15 September, 2009
|