కంటతడి పెట్టిన ఐశ్వర్య!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/aishwaryarai.jpg' align='right' alt=''>గాయలకు పూత పూయడం కంటే పుల్లతో పొడిచి వినోదించడం కొందరికి సరదా. రాయ్ ఫ్యామిలీ నుంచి వచ్చి అభిషేక్ ను పెళ్లి చేసుకోవడం ద్వారా బచ్చన్ల ఫ్యామిలీ కోడలైన ఐశ్వర్యారాయ్ వృత్తిపరమైన బాధ్యతలు నెరవేరుస్తూనే భర్తతో సంతోషంగా కాపురం చేసుకుంటోంది. అయితే ఆమె 'మాజీ లవర్లు' సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా 'గతం' తిరగదోడుతుండటం ఐశ్వర్యకు తీవ్ర మనస్థాపం కలిగిస్తోంది. ఈ ఇద్దరూ ఇటీవల చేసిన కామెంట్స్ తెలియడంతో సంజయ్ లీలా బన్సాలీ 'గుజారిష్' చిత్రం షూటింగ్ కోసం గోవాలో ఉన్న ఐశ్వర్య సెట్స్ లోనే కంటతడి పెట్టిందట. ఇది యూనిట్ సభ్యులను సైతం తీవ్రంగా కలిచివేసిందట.
ఐశ్వర్య-సల్మాన్-వివేకల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇప్పుడు గతం. అయితే వివేక్ ఇటీవల ఫరాఖాన్ ఛాట్ షో 'తేరే మేరే బీచ్ మే'లో తన అక్కసు వెళ్లగక్కుతూ అప్పట్లో తమ మధ్య చోటుచేసుకున్న సంఘటనలు తన వృత్తిపరమైన జీవితాన్ని మసకబారేలా చేసిందని వ్యాఖ్యానించారు. ఐశ్వర్యరాయ్ కు దగ్గరవడం వల్ల తన కెరీర్ దెబ్బతిందనీ, సల్మాన్ తో తలెత్తిన విభేదాల వల్ల నిర్మాతలు ముఖం చాటేశారనీ, అప్పటికే తనకు చెల్లించిన అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేయాలని నిలదీశారనీ చెప్పుకొచ్చారు. సల్మాన్ తక్కువేం కాదు. ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్యతో తాను డేటింగ్ చేసినప్పుడు ఏరోజూ కూడా ఆమెను శారీరకంగా బాధపెట్టలేదని చెప్పుకొచ్చారు. ఛాట్ షో వివేక్, ఇంటర్వ్యూలో సల్మాన్ తనను టార్గెట్ చేసుకోవడం తట్టుకోలేని ఐశ్వర్య 'గుజారిష్' సెట్స్ లో కంటతడిపెట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సల్మాన్, వివేక్ ల ప్రవర్తన ఏమాత్రం హుందా లేదనీ, పెళ్లి చేసుకుని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన ఏ మహిళ విషయంలోనైనా ఇలాంటి ప్రవర్తన అనుచితమవుతుందనీ ఐశ్వర్య శ్రేయోభిలాషులు సదరు హీరోలపై మండిపడుతున్నారు. ఐశ్వర్య జీవితం ఇప్పుడు రెండు అగ్ర ఫ్యామిలీలతో (రాయ్, బచ్చన్) ముడిపడిందని, పాత అనుబంధాల వల్ల ఐశ్వర్య కెరీర్ ఎంత ఇబ్బందికి గురైందో, ఎన్ని సినిమాలు వదులుకోవలసి వచ్చిందో ఆ ఇద్దరూ గ్రహిస్తే మంచిదనీ వారు హితవు పలుకుతున్నారు.
News Posted: 15 September, 2009
|