కంగన కొత్త బాయ్ ఫ్రెండ్...
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kangana5.jpg' align='right' alt=''>బాలీవుడ్ సెక్సీ బ్యూటీ కంగనా రనౌత్ కు ఇంకా మనసుకు నచ్చిన మగవాడెవరకూ కనెక్ట్ కాలేదు. అలాగని ప్రేమాయణాలు లేవని కాదు. ఎక్కడో అవి బెడసికొడుతున్నాయంతే. నటుడు ఆదిత్య పంచోలితో తొలి ప్రేమాయణం నడిపిన కంగన ఆ తర్వాత అతనికి దూరమైంది. ఆ తర్వాత నాలుగేళ్లుగా అధ్యయన్ సుమన్ తో ప్రేమాయణం నడిచినా ఈమధ్యనే అతను సైతం ముఖం చాటేశాడు. కెరీర్ పైనే పూర్తిగా దృష్టిసారించాలని అనుకుంటున్నానని చెప్పి చల్లగా జారుకున్నాడు. దీంతో కంగన మళ్లీ ఒంటరిదైంది. కింద పడినా ఎప్పుడూ తనదే పైచేయి అనిపించుకోవడానికి ఇష్టపడే కంగన ఇప్పుడు మరో కొత్త ప్రియుడి గూటిలోకి చేరిందని బాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
దర్శకుడు కునాల్ దేశముఖ్ ఇప్పుడు కంగనాపై మనసు పారేసుకుంటున్నాడు. కంగన్ సైతం తరచు అతనితో చెట్టాపట్లాలేసుకుని కనిపిస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కునాల్ ప్రస్తుతం 'జన్నత్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈమధ్యనే ఇటలీలో హాలిడే ట్రిప్ గడిపిన కంగనా ఆక్కడ్నించి ముంబై తిరిగి వస్తూ కునాల్ కోసం కొన్ని సీడీలు, ఇతర వస్తువులు కానుకగా తీసుకువచ్చిందట. ముంబై వచ్చిన తర్వాత బాంద్రాలో ఇద్దరూ ఛాయ్ పార్టీ చేసుకున్నారట. నిజానికి 'జన్నత్ ' చిత్రంలో కంగనానే కునాల్ ఎంపిక చేసినప్పటికీ కంగన బిజీ షెడ్యూల్స్ కారణంగా సోనాల్ చౌహాన్ ను ఎంపిక చేయాల్సి వచ్చిందట. కంగన సైతం ఇప్పుడు హిందీతో పాటు తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శక్వంలో ప్రభాస్ సరనస 'ఏక్ నిరంజన్' చిత్రంలో నటిస్తోంది. ఇంత బిజీలోనూ కంగన, కునాల్ ఒకరి సహచర్యం మరొకరు కోరుకుంటుండమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
News Posted: 17 September, 2009
|