జాన్ డింపుల్ వెరీ సింపుల్...
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/john.jpg' align='left' alt=''>సొట్టబుగ్గలు (డింపుల్) అదృష్టాన్ని కొనితెస్తాయని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. షారూక్ ఖాన్, జాన్ అబ్రహం, అర్జున్ రాంపాల్ వంటి హీరోలంతా స్వతసిద్ధంగా డింపుల్ ఉన్నవారే. నవ్వితే బుగ్గలు సొట్టపడుతుంటాయి. ఇప్పుడు ముంబైలోని పురుషులు సైతం డింపుల్ కోసం తహతహలాడుతున్నారు. తమ అభిమాన స్టార్ ల లుక్ ను సంతరించుకోవాలనే క్రేజ్ రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఓరకంగా దీన్ని మెట్రో సెక్సువల్ మానియాగా కూడా చెప్పుకోవచ్చు.
డింపుల్ లుక్ సంతరించుకునేందుకు పడుచు అమ్మాయిలు గత ఐదేళ్లుగా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనీ, ఇటీవల కాలంలో యువకులు సైతం తమను సంప్రదించడం మొదలైందనీ 'టోటల్ ఉమన్ క్లినిక్'కు చెందిన కన్సల్టెంట్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ కిరణ్ నాయక్ తెలిపారు. గత ఆరు నెలలలో 5 డింపుల్ క్రియేషన్ సర్జరీలు ఆయన చేశారు. వాటిలో 4 సర్జరీలు యువకులవే కావడం విశేషం. డింపుల్స్ కోసం ఊహించని విధంగా డిమాండ్ పెరిగిందనీ, పురుషులు సైతం ఇందుకోసం తహతహలాడుతున్నారనీ మరో కన్సెల్టెంట్ కాస్మెటిక్ సర్జన్ డాక్ట్ర మోహన్ థామస్ తెలిపారు. పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో కొత్తగా కనబడేందుకు యువకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. సహజంగా ఈ తరహా క్లయింట్స్ లో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్లలోపు ఉండి గ్లామర్ ఇండస్ట్రీలో కెరీర్ ను కోరుకుంటున్న వారని 23 ఏళ్ల అర్జున్ కుమార్ పేర్కొన్నారు. సొట్టబుగ్గలు ఉంటే మహిళలే కాకుండా, నిర్మాతలు కూడా ఇష్టపడతారనీ, కెమెరాకి కూడా సొట్టబుగ్గలంటే ఇష్టమనీ ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు. కుమార్ సైతం ఈమధ్యనే డింపుల్స్ కోసం 40 నిమిషాల పాటు సర్జరీ చేయించుకుని కొత్తరూపు సంతరించుకున్నారు. ఇందుకు రూ20.000 నుంచి 50,000 వరకూ ఖర్చవుతుందని హీరానందని హాస్టిటల్ కు చెందిన మరో కన్సల్టెంట్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ మిలింద్ వా తెలిపారు. పిల్లలుగా ఉన్నప్పటి నుంచి సొట్టబుగ్గలంటే తమకెంతో ఇష్టమని పలువురు క్లయింట్స్ తనకు చెబుతుంటారని ఆయన అన్నారు. డాక్టర్ వా గత ఆరు నెలల్లో సుమారు 8 డింపిల్ క్రియేషన్స్ సర్జరీలు చేశారు. నాలుగు సర్జరీలు పురుషులకే కావడం విశేషం.
News Posted: 19 September, 2009
|