సైఫ్ తోనే కరీనా బర్త్ డే
కరీనాకపూర్ తన 28వ బర్త్ డే ను ప్రియుడు సైఫ్ అలీఖాన్ సమక్షంలో రాజస్థాన్ లో జరుపుకొంటోంది. ఈ సోమవారమే కరీనా బర్త్ డే. నేటి ఉదయం ఈ ఇద్దరూ కలిసి ఉదంపూర్ లో అడుగుపెట్టి అక్కడి నుంచి నేరుగా ఉడైవిలాస్ హోటల్ కు చేరుకోవడంతో వారిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కరీనా నలుపురంగు స్లీవ్ లెస్ జాకెట్, పెద్ద కళ్లద్దాలు పెట్టుకుని తళుక్కుమని మెరిసిందనీ, సైఫ్ తెలుగు కుర్తా, నీలం రంగు స్కార్ఫ్ తలకు చుట్టుకుని ఎంతో ఉల్లాసంగా కనిపించారనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కరీనా-సైఫ్ జంట ఇదే హోటల్ లో ఈదుల్ ఫితర్ పండుగ, పుట్టిన రోజు వేడుక కలిసి జరుపుకోనున్నారనీ, అనంతరం కింగ్ ఫిషర్ మ్యాగజైన్ కోసం ఫోటో సెషన్ లో పాల్గొంటారనీ వారు తెలిపారు. నిజానికి సైఫ్ కు దూరంగానే కరీనా తన బర్త్ డే జరుపుకోనుందనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతూ వచ్చింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. అమీర్ ఖాన్ కథానాయకుడుగా నటిస్తున్న '3 ఇడియట్స్' షూటింగ్ లో కరీనా కొద్దిరోజులుగా బిజీగా ఉంది. గత ఏడాది సైతం ఇదే చిత్రం షూటింగ్ లో చిక్కుకుని సైఫ్ కు కరీనా సమయం కేటాయించలేకపోయింది. ఇదే పరిస్థితి ఈసారి పునరావృతం కాకూడదని భావించిన అమీర్ చిత్ర దర్శకుడు రాజు హిరానికి నచ్చజెప్పి షూటింగ్ ను మూడు రోజులు వాయిదా వేయాల్సిందిగా సూచించారట. దీంతో కరీనాకు కావాల్సినంత రిలీఫ్ దొరికి సైఫ్ ముంగిట వాలిపోయింది.
News Posted: 21 September, 2009
|