ముదురుతున్న ప్రేమాయణం!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/prabu-nayana.jpg' align='right' alt=''>ప్రేమలో ఉన్నప్పుడు నిజమైన పరీక్ష ఒకటుంటుంది. కీలక సమయాల్లో లవ్ పార్టనర్ కు దగ్గరగా ఉండటం ప్రేమబంధం బలపడడానికి ఓ బలమైన సంకేతమవుతుంది. కొరియాగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో తనకు ఎలాంటి సంబంధం లేదని నమ్మబలుకుతున్న నటి నయనతార చేతల్లో మాత్రం మీడియాను ఆకట్టుకునేలా తమ ఇద్దరి బంధాన్ని చాటుకుంటున్నట్టే కనిపిస్తోంది.సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో గత శుక్రవారం నాడు విడుదలైన 'వాంటెడ్' చిత్రం కోసం నయనతార ఎకాఎకిన ముంబై వెళ్లింది. ఆయనతో కలిసి తొలిరోజు తొలి ఆట (మార్నింగ్ షో) చూసి మరోసారి మీడియా దృష్టిలో పడింది. ఎన్టీఆర్ 'అదుర్స్' చిత్రం కోసం కోల్ కతా షూటింగ్ లో ఉన్న నయన ఆరోజు ఉదయమే ఫ్లయిట్ ఎక్కి ముంబైలో ల్యాండ్ అయింది.ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బాంద్రాలోని మల్టీప్లెక్స్ కు చేరుకుంది.
నయనతార కోరితే ఏదో ఒక మల్టీప్లెక్స్ థియేటర్ లో స్పెషల్ స్కీనింగ్ ను ప్రభుదేవా, బోనీకపూర్ ఎరేంజ్ చేసేవారే. అయితే జనం మధ్య, జనం రియాక్షన్ తెలుసుకుంటూ చూడాలని నయన కోరుకోవడంతో ప్రభుదేవా ఆ ఆరేంజ్ మెంట్ చేశారు. నయనతార ఆర్మీ స్కూలులో చదవడం, తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో ఆమెకు హిందీ రాయడం, చదవడం వచ్చనీ, 'వాంటెండ్' చిత్రాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ చూసిందనీ ప్రత్యక్ష సాక్షల కథనం. నయనతార ఫేవరెట్ యాక్టర్ సల్మాన్ కావడంతో ఆయన పలికిన పంచ్ డైలాగ్ లు, విలన్ పాత్రధారి ప్రకాష్ రాజ్ నటనను ఆమె బాగా ఎంజాయ్ చేసినట్టు వారు తెలిపారు. సినిమా అనంతరం ప్రభుదేవాను జనం గుర్తుపట్టి అభినందనలతో ముంచెత్తడంతో నయన కూడా ఆయనకు కంగ్రాట్స్ చెప్పి అతని సంతోషాన్ని రెట్టింపు చేసిందనీ, తమిళ 'పోకిరి' కంటే హిందీలో పెద్ద హిట్ అవుతుందని బోనీకపూర్ కు చెప్పడంతో 'అదే జరిగితే నీ నోట్లో చక్కెర పోస్తాను' అంటూ ఆయన తన సంబరం వ్యక్తం చేశారనీ ఆ వర్గాలు తెలిపాయి. సాయంత్రం నాటికే సినిమా సూపర్ హిట్ అంటూ అన్ని ప్రాంతాల నుంచి డిక్లేర్ అయింది. మరుసటి రోజు ఉదయం షూటింగ్ ఉండటంతో నయనతార హైద్రాబాద్ ఫ్లయిట్ ఎక్కేసిందట. అయితే అంతకుముందు ప్రభుదేవా గట్టి పట్టే పట్టారనీ, బోనీకపూర్ ఈద్ పార్టీ ఉందనీ, అక్కడకు వస్తే సల్మాన్ ను కూడా కలుసుకోవచ్చనీ ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయితే నయన తన షూటింగ్ షెడ్యూల్ గురించి చెప్పడంతో ఆమెను ప్రభుదేవా ఎయిర్ పోర్ట్ వద్ద కారులో డ్రాప్ చేశారట. ప్రొఫెషనలిజం తప్పులేదు కానీ, పెళ్లయి..ఇద్దరు పిల్లలు కూడా ఉన్న ప్రభుదేవాతో పబ్లిక్ గా తిరగడానికి నయనతార సంకోచించకపోవడమే ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
News Posted: 23 September, 2009
|