సుస్మిత ఆన్ లైన్ బిజినెస్?
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/susmitha.jpg' align='right' alt=''>బాలీవుడ్ ప్రముఖ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. తన పేరు ఉపయోగించుకుని ఘరానాగా డబ్బులు దండుకోవాలని చూస్తున్న సైబర్ నేరగాళ్ల పనిపట్టాలనుకుంటోంది. ఇందుకోసం సైబర్ నిపుణులతోనూ సంప్రదించే పనిలో ఉంది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతుండటంతో ఒక్కోసారి విపరీత పరిణామాలు సైతం తలెత్తుతున్నాయి. నటీనటుల పేరుతో ఫేక్ ప్రొఫైల్స్ బెడద కూడా ఇందులో ఒకటి. ఇటీవల కాలంలో ఫేస్ బుక్, ఆర్కుట్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు పలువురుని ఆకట్టుకుంటున్నాయి. సుస్మిత పేరుతో ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఓ అకౌంట్ క్రియేట్ చేసిన ఆగంతకులు అంతటితో ఆగకుండా 'మీకు తోచిన సాయం చేస్తే సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాం' అని పేర్కొనడం సుస్మిత దృష్టికి వచ్చింది. మామూలుగా అయితే తన పేరుతో అకౌంట్ ఓపెన్ చేయడాన్ని సుస్మిత సీరియస్ గా తీసుకునేది కాదట. అయితే తన పేరును ఉపయోగించుకుని డబ్బు దండుకోవాలని చూడటమే ఆమె అగ్రహానికి కారణమవుతోంది. ఈ తరహా మోసగాళ్లకు ముకుతాడు వేసేందుకు సైబర్ ఎక్స్ పర్ట్ లను ప్రస్తుతం ఆమె సంప్రదిస్తోంది.
News Posted: 23 September, 2009
|