రజనీ, కమల్ ఉత్తమనటులు
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kamal-rajani2.jpg' align='right' alt=''>తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. తమిళనాడు ప్రభుత్వం ఏటా ఇచ్చే సినీ అవార్డులను సోమవారంనాడు ప్రకటించింది. 2007, 2008 సంవత్సరాలకు గాను ఈ అవార్డులను ప్రకటించారు. 2007 సంవత్సరానికి 'శివాజీ' చిత్రంలో నటనకు గాను రజనీకాంత్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ చిత్రం అవార్డు కూడా ఇదే సినిమాకి దక్కింది. 2008 సంవత్సరానికి 'దశావతారం' చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డును కమల్ దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా కూడా 'దశావతారం' ఎంపికైంది.
'మోళి' చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటి (2007) అవార్డును జ్యోతిక దక్కించుకుంది. 'పిరివోమ్ సందిప్పోమ్' చిత్రానికి ఉత్తమ నటిగా (2008) స్నేహ ఎంపికైంది. 2007 సంవత్సరానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా 'మోళి' ఎంపికైంది. తృతీయ ఉత్తమ చిత్రంగా 'పల్లికూడమ్' ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను తంగర్ బచ్చన్ ఉత్తమ దర్శకుడి అవార్డును దక్కించుకున్నారు. ఇదే ఏడాది స్పెషల్ కేటగిరిలో 'పెరియార్' చిత్రంలో నటనకు సత్యరాజ్, 'మృగం' చిత్రానికి పద్మప్రియకు స్పెషల్ అవార్డులు ప్రకటించారు. 2008 స్పెషల్ కేటగిరిలో సూర్య (వారణం ఆయిరం), త్రిష (అభియుం నానుమ్) చిత్రానికి స్పెషల్ ప్రైజ్ లు అందుకుంటున్నారు. 2007 సంవత్సరానికి ఉత్తమ హాస్యనటుడి అవార్డు వివేక్, 2008 సంవత్సరానికి వడివేలు ఎంపికయ్యారు.
News Posted: 29 September, 2009
|