పోయెస్ రోడ్డుకు రజనీ పేరు
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kamal-rajani1.jpg' align='right' alt=''>పద్మశ్రీ కమల్ హాసన్ 50వ నట వసంతంలోకి అడుగుపెట్టిన తరుణంలో ఆయనకు తమిళనాడు ప్రభుత్వం శాశ్వాత గౌరవం కల్పించేందుకు సుముఖంగా ఉంది. ఆరో ఏట బాలనటుడిగా అడుగుపెట్టిన కమల్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో కి అడుగుపెట్టన కమల్ కు సముచిత గౌరవం కల్పించేందుకు చెన్నైలోని ఎల్డామ్స్ రోడ్ కి 'కమల్ హాసన్ రోడ్' గా పేరు మార్చాలని తమిళనాడు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. కమల్ తరహాలోనే తమిళనాట సూపర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న రజనీకాంత్ సైతం మూడు దశాబ్దాలుగా తమిళ చిత్రసీమను ఏలుతున్నారు. పనిలో పనిగా కమల్ తో పాటు, రజనీకాంత్ ను కూడా చేర్చి ఆ ఇద్దరు మేటి నటులకూ శాశ్వత గౌరవం కల్పించేందుకు కూడా నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఎల్డామ్ రోడ్ కి కమల్ పేరు పెట్టి, రజనాకాంత్ చిరకాలంగా ఉంటున్న పోయెస్ గార్డెన్ కి కానీ, కోడంబాక్కం మెయిన్ ఎంట్రన్స్ అయిన ఆర్కాట్ రోడ్ కి గానీ 'రజనీకాంత్ రోడ్'గా పేరు మార్చాలనుకుంటున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్ పుట్టినరోజులు దగ్గర్లోనే ఉండటంతో ఆ సమయానికి కల్లా పేరు మార్పిడి జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. కమల్ నవంబర్ లోనూ, రజనీ డిసెంబర్ లోనూ పుట్టారు. కమల్ తో పాటు రజనీకి కూడా శాశ్వత గౌరవం కల్పించాలన్న ప్రభుత్వం నిర్ణయం ఈ ఇద్దరి సూపర్ స్టార్ ల అభిమానులను సంబరంలో ముంచెత్తుతోంది.
News Posted: 3 October, 2009
|