ఆసిన్ కు ఆశుతోష్ ఆఫర్
దక్షిణాది చిత్రాల్లో మంచి డిమాండ్ లో ఉండగానే బాలీవుడ్ కు షిఫ్ట్ అయిన ఆసిన్ కు తొలి చిత్రం 'గజనీ' తో పెద్ద సక్సెస్ దక్కింది. ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే సల్మాన్ తో 'లండన్ డ్రీమ్స్' చిత్రంలో నటించే అవకాశమూ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిజానికి ఈ రెండు చిత్రాలు మినహా ఆకర్షణీయమైన అవకాశాలు ఏవీ ఆసిన్ కు రాలేదని అంతా అనుకుంటున్న తరుణంలో అశుతోష్ రూపంలో ఓ బంపర్ ఆఫర్ వచ్చి ఇప్పుడు ఆమె ఒళ్లో వాలింది.
అశుతోష్ గోవారికర్ సినిమాలో నటించే ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ల నుంచి, వర్ధమాన హీరోయిన్లు సైతం తహతహలాడుతుంటారు. 'లగాన్', 'స్వదేస్', 'జోథా అక్బర్' వంటి అద్భుత చిత్రాలకు అశుతోష్ దర్శకత్వం వహించారు. అశుతోష్ తాజాగా 'ఖేలే హమ్ జీ జాన్ సే' అనే చారిత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో కథానాయిక పాత్రను ఆసిన్ కు ఆఫర్ చేయడం, వెంటనే ఆసిన్ అగ్రిమెంట్ చేయడం చకచకా జరిగిపోయాయి. కథనాయకుడుగా అభిషేక్ బచ్చన్ ఇప్పటికే అగ్రిమెంట్ చేశారు. ఆసక్తి కరంగా తొలుత అభిషేక్ కు జోడిగా ఐశ్వర్యాబచ్చన్ ను అశుతోష్ అనుకున్నారు. కారణాంతరాల వల్ల ఐశ్వర్య ఆ ఆఫర్ ను అందిపుచ్చుకోలేదు. ఐశ్వర్య ప్లేస్ లో ఇప్పుడు ఆసిన్ వచ్చి చేరడంతో కుర్రహీరోయిన్లంతా ఆమె అదృష్టం చూసి కుళ్లుకుంటున్నారట.
News Posted: 5 October, 2009
|