అమీర్-కరీనా 'లిప్ 2 లిప్'
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/3-diots.jpg' align='right' alt=''>జీరో సైజ్ ఆహార్యంతో కుర్రకారు గుండెల్లో గుబులు సృషిస్తున్న కరీనాకపూర్ ఇప్పుడు ఏకంగా అమీర్ ఖాన్ తో మూడు ముద్దు సీన్లు సునాయాసంగా లాగించేసింది. రాజ్ కుమా్ర హిరాని దర్శకత్వంలో రూపొందుతున్న '3 ఇడియెట్స్' కోసమే ఈ ముద్దు ముచ్చట. స్క్రిప్టు డిమాండ్ మేరకు ఈ ముద్దు సన్నివేశాలు తీయాల్సి వచ్చిందట. అందులోనూ అమీర్ కు 'మిస్టర్ పెర్ ఫెక్షనిస్ట్' అనే పేరు ఉందనే ఉంది. బహుశా సహజత్వం కోసం అమీర్ పడిన తపన వల్లనే కావచ్చు..ఈ ముద్దు సన్నివేశాల కోసం అమీర్ 14 టేకులు తీసుకున్నట్టు యూనిట్ వర్గాల కథనం.
సినిమాలోని మూడు ముద్దు సన్నివేశాల్లో 'లిప్ 2 లిప్ కిస్' ఒకటనీ, ఇది క్లైమాక్స్ లో వస్తుందనీ తెలుస్తోంది. అమీర్ ఖాన్ గతంలో కరీనా అక్క కరిష్మాకపూర్ తోనూ ముద్దుల రికార్డు సృష్టించారు. 1996లో వచ్చిన 'రాజా హిందుస్తాని' చిత్రంలో కరిష్మాకు అమీర్ పెట్టిన ముద్దు అప్పట్లో బాలీవుడ్ హాట్ టాపిక్ అయింది. ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన స్క్రీన్ కిస్ లలో ఇదొకటిగా నిలిచింది. ఇప్పుడు '3 ఇడియట్స్'లో అమీర్-కరీనా ముద్దు సీన్ల వ్యవహారంపై కూడా ఘాటు చర్చే జరుగుతోంది. ఈ చిత్రంలో మాధవన్, షర్మన్ జోషి తదితరులు కూడా నటించారు. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
News Posted: 5 October, 2009
|