'అలాదీన్'కు బిగ్ బి ఆలాపన
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/alladin.jpg' align='right' alt=''>బిగ్ బి అమితాబ్ బచ్చన్ గొంతెత్తి పాడిన పలు చిత్రాలు గతంలో పెద్ద సక్సెస్ సాధించింది. 'డాన్', 'మిస్టర్ నట్వర్ లార్', 'సిల్ సిలా', 'ఖుదాగవా' 'కభి ఖుషి కభీ ఘమ్' వంటి పలు చిత్రాలు ఈ కోవలోనివే. ఆయన గంభీరమైన గాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఈమధ్యన ఆయన 'అలాదీన్' చిత్రం పాటల రికార్డింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ప్రత్యక్షమై సంగీత ద్వయం విశాల్-శేఖర్ లను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ సమయంలో రికార్డింగ్ జరుగుతున్న ఓ పాటకు ఆలాపన చేసి అందరి మెప్పు పొందారు.
'అలాదీన్' చిత్రంలోని 'ఓ రె సావరియా' అనే పాటను సింగర్ సుజయ్ ఘోష్ తో పాడిస్తుండగా అమితాబ్ అక్కడకు వచ్చారు. ఆ పాట చివర్లో ఓ ఆలాపన ఉంటే బాగుంటుందంటూ అమితాబ్ పాడి వినిపించారు. మంత్ర ముగ్దులైన విశాల్-శేఖర్ లు వెంటనే ఆ పాటకు చివర్లో అమితాబ్ చేత ఆలాపన చేయించారు. 'నిజానికి మా కంపోజిషన్ లో పాట చివర ఆలాపన లేదు. అయితే అమిత్ జీ వచ్చి ఒక చిన్న ఆలాపాన వినిపించారు. నిజానికి ఆయన ప్రొఫెషనల్ సింగర్ కాదు. శిక్షణ కూడా తీసుకోలేదు. కానీ ఆయన పాడిన తీరు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పాడిన ఆలాపనను పాట చివర్లో చేర్చాం' అని విశాల్ తెలిపారు. ఇప్పుడు బచ్చన్ ఆలాపన చేసిన సాంగ్ తో థియేటర్ ప్రమోలను కూడా రిలీజ్ చేశారు. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అలాదీన్' చిత్రం 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' జానపద కథతో రూపొందుతోంది. రితీష్ దేశ్ ముఖ్, సంజయ్ దత్ వంటి తారలు నటిస్తున్న ఈ చిత్రంలో అల్లావుద్దీన్ కు వరాలిచ్చే భూతం పాత్రను అమితాబ్ పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
News Posted: 5 October, 2009
|