'రావణ్' నుంచి బిపాసా ఔట్!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/Bipasha1.jpg' align='right' alt=''>ఆలిండియా టాప్-10 దర్శకులలో ఒకరైన మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. సెక్సీ బ్యూటీ బిపాసాబసు ఇంకెంతమాత్రం మణిరత్నం 'రావణ్' చిత్రంలో ఉండబోవడం లేదు. ఆ పరిణామం బిపాసాను సహజంగానే మనస్థాపానికి గురి చేసిందని ముంబై వర్గాల తాజా సమాచారం.
తమిళ, హిందీ భాషల్లో 'రావణ్' చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. హిందీ వెర్షన్ లో అభిషేక్, ఐశ్వర్యా బచ్చన్, విక్రమ్ నటిస్తుండగా, తమిళ వెర్షన్ లో విక్రమ్, ఐశ్వర్య జంటగా నటిస్తున్నారు. ప్రియమణి రెండు భాషల్లోనూ రామాయణంలోని 'శూర్పణక'ను పోలిన పాత్రను పోషిస్తున్నారు. ఇందులో మరో కీలకమైన మండోదరి పాత్రను తొలుత నయనతారను మణిరత్నం అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను నయనతార అందిపుచ్చుకోలేదు. దాంతో ఆ పాత్రను పోషించే అవకాశం బిపాసాను వరించింది. ఇందుకోసం 20 రోజుల పాటు కాల్షీట్లు కూడా ఇచ్చింది. డ్రెస్ రిహార్సల్స్ కూడా జరిగాయి. బిపాసాతో ఓ ఐటెం సాంగ్ ను కూడా మణి ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు మణి ఆలోచనలో మార్పు చోటుచేసుకుందనీ, బిపాసా క్యారెక్టర్ వల్ల సినిమా నిడివి ఎక్కువవుతోందని ఆయన అభిప్రాయపడుతున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో బిపాసాకు ఆయన ఎగ్జిట్ గేట్ చూపించినట్టు సమచారం. బిపాసా ప్లేస్ లో ఇంకెవరినైనా తీసుకుంటారా, ఆ పాత్రను పూర్తిగా సినిమా నుంచి తొలగిస్తారా అనేది ఇంకా స్పష్టం కావలసి ఉంది. మనస్థాపంతో ఉన్న బిపాసాకు తన తదుపరి చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని మణిరత్నం భరోసా ఇచ్చినట్టు తెలిసింది.
News Posted: 6 October, 2009
|