కరీనాకు సల్మాన్ గిఫ్ట్ బ్యాగ్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/salman-kareena.jpg' align='right' alt=''>సల్మాన్ ఖాన్ కు సంతోషం వచ్చినా, కోపం వచ్చినా పట్టుకోలేమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం, తనతో పనిచేసిన యూనిట్ సభ్యులకు గిఫ్ట్ లు ఇవ్వడం సల్మాన్ తరచు చేస్తుంటారు. అలాగే తన కో-స్టార్ లను కంఫర్ట్ గా ఉంచేందుకు కూడా సల్మాన్ తపనపడుతుంటారు. తాజాగా కరీనాకపూర్ మనసుపడిన ఓ ఖరీదైన వస్తువును సల్మాన్ ఆమెకు బహుమతిగా ఇచ్చి ఆమెను సంబరంలో ముంచెత్తారు. కరీనాకు సల్మాన్ ఇచ్చిన బహుమతి ఓ ముచ్చటైన హ్యాండ్ బ్యాగ్. దాని ఖరీదు అక్షరాలా రెండున్నర లక్షలు.
సల్మాన్-కరీనా కలిసి ప్రేమ్ సోనీ దర్శకత్వంలో 'మై ఔర్ మిసెస్ ఖన్నా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగింది. షూటింగ్ విరామ సమయాల్లో కరీనా ఒంటరిగానే షాపింగ్ కు వెళ్లి వస్తుండేది. ఒకరోజు సల్మాన్ కూడా ఆమెతో కలిసి షాపింగ్ కు వెళ్లారు. అక్కడ ఓ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ చూసి కరీనా ముచ్చటపడింది. ఆ బ్యాగ్ తీసుకుని డబ్బు చెల్లించేందుకు కౌంటర్ వద్దకు వద్దకు వచ్చిన కరీనాకు అప్పటికే బిల్లు చెల్లించారంటూ స్టోరీ కీపర్ తాపీగా చెప్పారు. ఆ మొత్తం ఇచ్చింది సల్మాన్ ఖాన్ అని తెలుసుకున్న కరీనా ఆనందానికి హద్దుల్లేవట. మొత్తానికి మగువల మనసు తెలుసుకోవడంలోనూ సల్మాన్ మంచి ఎక్స్ పర్ట్ అని నిరూపించుకున్నారు.
News Posted: 7 October, 2009
|