అమితాబ్ ర్యాంప్ వాక్...
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/cheeni-kum.jpg' align='right' alt=''>మెలికలు తిరిగిన కండలు ప్రదర్శిస్తూ గుండెల్లో గుబులు పుట్టించే యువకులు మాత్రమే ర్యాంప్ వాక్ చేస్తారని అనుకుంటే పొరపాటే. వయసు పైబడినా చెక్కుచెదరని గాంభీర్యం, హుందాతనం ఉట్టిపడే హ్యాండ్ సమ్ ఓల్డ్ మన్ అమితాబ్ బచ్చన్ సైతం ఇప్పుడు ర్యాంప్ వాక్ తో అలరించబోతున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లయిన అబూ జాని, సందీప్ కోస్లా ద్వయం ఈనెల 11న ముంబైలో ఏర్పాటు చేస్తున్న ఫ్యాషన్ షో లో అమితాబ్ 'స్టార్ ఆఫ్ ది అట్రాక్షన్' కాబోతున్నారు. ఫ్రౌడ అందాల టబూ ఆయనతో కలిసి ర్యాంప్ వాక్ లో పాల్గొనబోతుండటం మరో విశేషం. గతంలో అమితాబ్-టబు జంటగా 'చీనీ కుమ్' చిత్రంలో నటించారు.
అబూ-సందీప్ లు అమితాబ్ ఫేవరెట్ డిజైన్లర్లు కావడంతో పాటు వారు డిజైన్ చేసిన దుస్తులను అమితాబ్ చాలాకాలంగా ధరిస్తూ వచ్చారు. తన ఫేవరెట్ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ లో పాల్గొనబోతున్న విషయాన్ని అమితాబ్ సైతం ధ్రువీకరించారు. సందీప్ సైతం ఇదే విషయాన్ని ముచ్చటిస్తూ 'అమితాబ్ దుస్తులకు మేము చాలాకాలంగా డిజైన్ చేస్తున్నాం. టబూ సైతం మేము డిజైన్ చేసిన దుస్తులు వాడుతుంటారు. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది' అని సంబరం వ్యక్తం చేశారు. అమితాబ్-టబూ జంటను ఎంచుకోవడం గురించి అడిగినప్పుడు 'చీనీ కుమ్' చూసినప్పటి నుంచి ఆ ఇద్దర్నీ మళ్లీ తమ ఫ్యాషన్ షో ద్వారా ర్యాంప్ పైకి తీసుకురావాలని అనుకున్నామనీ, ఆ అవకాశం ఇప్పుడు దక్కిందనీ అన్నారు.
News Posted: 7 October, 2009
|