అభి కోసం ఐష్ ఉపవాసం
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/Aishwarya-abhi.jpg' align='right' alt=''>బచ్చన్ ఫ్యామిలీ కోడలుగా ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఏటా 'కార్వా చౌత్ వ్రతం' చేయడం పరిపాటి. అయితే బుధవారంనాడు మాత్రం ఒకింత భిన్నంగా ఈ వ్రతాన్ని ఐశ్వర్య ఆచరించింది. ఉత్తరాదిన పెళ్లయిన గృహిణులు తమ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాలని కోరుకుంటూ సంప్రదాయబద్ధంగా ఏటా ఈ కార్వా చౌత్ వ్రతం చేస్తుంటారు. ఐశ్వర్య రెండేళ్లుగా ముంబైలో తన నివాసంలోనే ఉపవాస నియమాలతో ఈ వ్రతాన్ని ఆచరించేది. ఈసారి కూడా ఐశ్వర్య వ్రత నియమాలను పాటించినప్పటికీ...ఇంట్లో కాకుండా మణిరత్నం 'రావణ్' షూటింగ్ సెట్స్ లో తన భర్త అభిషేక్ పక్కనే ఉండగా జరుపుకోవడం విశేషం. ప్రస్తుతం పుణెలో జరుగుతున్న షూటిగింలో ఈ ఇరువురూ పాల్గొంటున్నారు.
షూటింగ్ లో భాగంగా పలు యాక్షన్ సన్నివేశాలు, కొన్ని ఛేజింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందనీ, ఇందుకు అవసరమైన ఎనర్జీ కోసం ఉపవాసం విరమించుకోవాలని అభిషేక్ సూచించినప్పటికీ ఐశ్వర్య మాత్రం రోజంతా ఉపవాసంతోనే ఉందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఏటా పాటిస్తున్న సంప్రదాయాన్ని వదులుకోవడం ఇష్టం లేని ఐశ్వర్య పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోలేదనీ, అయినప్పటికీ ఎంతో ఉల్లాసంగా షూటింగ్ లో పాల్గొందనీ వారు తెలిపారు. అభిషేక్ సైతం రోజంతా ఐశ్వర్యను కనిపెట్టుకుని ఎంతో మురిపంగా చూసుకోవడం కొసమెరుపు.
News Posted: 8 October, 2009
|