కరీనా-సాహిద్ కలిసేది కల్ల!
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/shahid-kareenakapur.jpg' align='right' alt=''>ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న 'మిలేంగే మిలేంగే' చిత్రాన్ని ఎట్టకేలకు నిర్మాత బోనీకపూర్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఈమధ్యనే హిమేష్ రేషమ్మియా రెండు పాటలు రికార్డింగ్ కూడా చేశారు. బయట చిత్రాలకు చేయకూడదని హిమేష్ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆరేళ్ల క్రితం ఒప్పుకున్న సినిమా కావడంతో ఆ రెండు పాటల రికార్డింగ్ కానిచ్చేశారు. అయితే ఈ సినిమాలో హీరోహీరోయిన్లయిన కరీనాకపూర్, సాహిద్ కపూర్ లు మాత్రం ఈ రెండు పాటలకూ కలిసి నటించే అవకాశాలు మాత్రం లేవు. ఒకప్పటి ప్రేమజంట అయిన కరీనా-సాహిద్ ల మధ్య ఇప్పుడు ఎలాంటి సుహృద్భావ వాతారవణం లేకపోవడమే ఇందుకు కారణం.
దీనిపై వ్యాఖ్యానించేందుకు కరీనా అందుబాటులో లేనప్పటికీ, నిర్మాత బోనీకపూర్, దర్శకుడు సతీష్ కౌషిక్ లకు ఎలాంటి సహకారమైనా అందించేందుకైనా ఆమె సిద్ధంగానే ఉదనీ, అయితే సినిమా కోసం అదనపు సాంగ్ లో పాల్గొనేందుకు మాత్రం సిద్ధంగా లేదనీ కరీనా సన్నిహిత వర్గాలు తెలిపాయి. సాహిద్ వ్యవహారం ముగిసిన కథ అని వారు అభివర్ణించారు. అయితే కొత్తగా హిమేష్ రికార్డు చేసిన ట్రాక్ మాత్రం మ్యూజిక్ వీడియోలో ఉంటుందనీ, ఫిల్మ్ ప్రమోషన్ లో కూడా ఉపయోగించనున్నారనీ తెలుస్తోంది. అలాగే సాహిద్-కరీనా కలిసి సినిమా పబ్లిసిటీలో కూడా పాల్గొనబోవడం లేదు. ' కొత్తగా సాహిద్, కరీనాపై ఎలాంటి షూటింగ్ జరపడం లేదు. అయితే ఇటీవల రికార్డింగ్ చేసిన రెండు పాటలనూ సినిమా ప్రారంభంలో, చివరి టైటిల్స్ లో ఉపయోగించుకుంటాం. ప్రమోషన్ వీడియోలోనూ ఇవి ఉంటాయి' అని సతీష్ కౌషిక్ ధ్రువీకరించారు.
News Posted: 10 October, 2009
|