అమితాబ్ చాలీసా...
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/amitabh_bachchan.jpg' align='left' alt=''>బీహార్ లో రాజకీయాల నాయకులను స్తుతించే చాలీసాలు గతంలో చాలానే వచ్చాయి. 'లాలూ చాలీసా', 'నితీష్ చాలీసా' తర్వాత ఇప్పుడు
బిగ్ బి అమితాబ్ వంతు వచ్చింది. 67వ పడిలోకి ఈమధ్యనే అడుగుపెట్టిన అమితాబ్ బచ్చన్ ను స్తుతిస్తూ బీహార్ కు చెందిన ఓ లాయర్ ఇప్పుడు అమితాబ్ చాలీసాను రచించి దానిని పబ్లిష్ చేయడం ద్వారా అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నారు.
బోజ్ పూర్ జిల్లా ఆర్రా సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న శరద్ కుమార్ మూడు నెలల పాటు కష్టపడి 'అమితాబ్ చాలీసా'ను రచించారు. బిగ్ బి జీవితంలో చవిచూసిన ఎత్తుపల్లాలతో సహా ఆయన జీవితంలోని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ చాలీసాను రూపొందించారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ 40 ఏళ్ల కెరీర్ ను విశ్లేషిస్తూ చాలీసా రచించాలనే ఆలోచన ఈ ఏడాది ప్రారంభంలోనే ఆయనకు కలిగిందట. శరద్ ఆ విషయాన్ని ముచ్చటిస్తూ, అమితాబ్ బచ్చన్ తనను ఎంతో ప్రభావితం చేశారనీ, జీవితంలో ఏదో ఒకరోజు ఆయనను కలుసుకోవాలన్నదే తన చిరకాల స్వప్నమనీ తెలిపారు. అమితాబ్ కు చెందిన సమాచారాన్ని వెబ్ సైట్లు, పత్రికలు, మ్యాగజైన్ల ద్వారా తాను సేకరించినట్టు చెప్పారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి అయినప్పడు 1990లో ఆయనను స్తుతిస్తూ 'లాలూ చాలీసా' తొలిసారి వచ్చింది. ఆ తర్వాత ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి చాలీసా, తదనంతరం నితీష్ చాలీషా, మాజీ ప్రధాని అలల్ బిహారీ చాలీసాలు వచ్చాయి. 'లాలూ చాలీసా' 1700 కాపీలు, 'అటల్ చాలీసా' 700 కాపీలు అమ్ముడయ్యాయి.
News Posted: 13 October, 2009
|