సల్మాన్ 'మోస్ట్ వాంటెడ్'
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/wanted.jpg' align='right' alt=''>బాలీవుడ్ లో కొద్ది కాలంగా సరైన సక్సెస్ లు లేని సల్మాన్ ఖాన్ కు తాజాగా 'వాంటెడ్' చిత్రం సరైన బ్రేక్ ఇచ్చింది. ఇంతవరకూ అమీర్ ఖాన్ 'గజనీ' అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధిస్తే...ఆ రికార్డును 'వాంటెడ్' అధిగమించనుందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రెండు వారాల్లో 'వాంటెడ్' 52 కోట్లు వసూలు చేసి సంచనలం సృష్టించింది. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించి ఇబ్బడిముబ్బడిగా కలెక్షన్లు వసూలు చేస్తుడటం నిర్మాత బోనీకపూర్ ను సంబరంలో ముంచెత్తుతోంది. ఇందులో భాగంగానే 'వాంటెడ్' చిత్రానికి సీక్వెల్ తీసేందుకు కూడా ఆయన కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనికి 'మోస్ట్ వాంటెడ్' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. 'వాంటెడ్' చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేసిన దర్శకుడు ప్రభుదేవాకే మళ్లీ దర్శకపగ్గాలు అప్పగించబోతున్నారని సినీ వర్గాల సమాచారం.
సీక్వెల్ లో సల్మాన్ మరోసారి హీరోగా నటించబోతున్నారనీ, సల్మాన్ కు జంటగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారనీ తెలుస్తోంది.'వాంటెడ్' చిత్రంలో అయేషా టకియా హీరోయిన్ గా నటించింది. సీక్వెల్ లో ఆమెకు చోటు ఉంటుందా అనేది చూడాలి. ఆసక్తికరంగా సల్మాన్ తో రెండోసారి పనిచేయబోతున్న ప్రభుదేవా మరో హిందీ చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. అందులోనూ సల్మాన్ కథానాయకుడుగా నటించనున్నారు. ఆ చిత్రానికి సాజిద్ నడియడ్ వాలా నిర్మాత.
News Posted: 13 October, 2009
|