'ఆడి' కారులో స్నేహ
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/sneha-bikini.jpg' align='right' alt=''>గ్లామర్ తో హీరోయిన్లు నెట్టుకొస్తున్న తరుణంలో హోమ్లీ గాళ్ ఇమేజ్ నే మొదట్నించీ ఇష్టపడుతున్న స్నేహ మరో వసంతంలోకి అడుగుపెట్టింది.ఈనెల 12వ తేదీన ఆమె 28వ బర్త్ డేని అనాథ పిల్లలు, తన కుటుంబ సభ్యుల మధ్య చెన్నైలో ఎంతో ఉల్లాసంగా, నిరాడంబరంగా జరుపుకొంది. అనాథ పిల్లలకు ఆశ్రయం ఇస్తున్న చెన్నైలోని భారత శిశు సంక్షేమ మండలికి తన తండ్రి, పెర్సనల్ మేనేజర్ తో కలిసి వెళ్లిన స్నేహ కొద్ది గంటలసేపు వారితో ఉత్సాహంగా గడిపారు. వారి సమక్షంలోనే కేక్ కట్ చేశారు. పిల్లలకు స్వీట్లు పంచి వారితో తన ఆనందాన్ని పంచుకున్నారు.
'పిల్లలతో కలిసి కొంతసేపు గడపడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈసారి కూడా కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం ఆలయానికి వెళ్లాను. ఈసారి మరో స్పెషాలిటీ కూడా ఉంది. నాన్నగారు ఖరీదైన తెలుపురంగు ఆడి కారును నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. పట్టలేని సంతోషం కలిగింది' అంటూ స్నేహ ఆ ముచ్చట చెప్పుకొచ్చింది.
News Posted: 14 October, 2009
|