లవ్ పెయింటర్ సల్మాన్
కత్రిన కైఫ్ హృదయానికి బాగా దగ్గరైన సల్మాన్ ఖాన్ తన ప్రేమను చాటుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోరని మరోసారి నిరూపించుకున్నారు. మంగళవారం రాత్రి ముంబైలో జరిగిన కూటూర్ వీక్ (ఫ్యాషన్ షో) లో ర్యాంప్ పై కత్రినా తళుక్కుమని మెరిసింది. ఆమె ధరించిన డ్రెస్ కు సల్మాన్ స్వయంగా హ్యాండ్ పెయింట్ వేశారు. ఆ దుస్తులపై ఓ సెయింట్ ముఖచిత్రాన్ని సల్మాన్ పెయింట్ చేశారు.
ఫ్యాషన్ షో కోసం ఆరోజు ఉదయమే భోపాల్ నుంచి ముంబై చేరుకున్న కత్రినకు సల్మాన్ తాను పెయింట్ చేసిన దుస్తులు చూపించి ఆమెను సంబరంలో ముంచెత్తారు. సల్మాన్ కు పెయింటింగ్ ఓ హాబీ అయినప్పటికీ డ్రస్ పెయింటింగ్ చేయడం మాత్రం ఇదే మొదటిసారి. 'డిజైనర్లు షనె, ఫల్గుని పీకాక్ లు ఈ రోజు ఉదయమే నా డ్రస్ కొలతలు తీసుకుని అద్భుతంగా డిజైన్ చేశారు. ఎప్పుడెప్పుడు ర్యాంప్ వాక్ చేస్తానా అని ఆత్రంగా ఉంది' అంటూ ఫ్యాషన్ షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు కత్రినా చెప్పింది.పరిశ్రమకు చెందిన ప్రముఖ
తారలు ఈ ఫ్యాషన్ షోకు హాజరయ్యారు. ప్రీతిజింతా, శ్రీదేవి, బోనీకపూర్, మలైకా అరోరా ఖాన్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, అమీషా పటేల్, సీమా ఖాన్, మనీష్ మల్హోత్రా, అమృత అరోరా, ట్వింకిల్ ఖన్నా, సల్మాన్ మామ్స్ సల్మా, హెలెన్ ముందు వరుసలో కనిపించారు. సుస్మితా సేన్, అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు వేరే వరుసలో కూర్చున్నారు. గవన్ మిగూయెల్, షన్, ఫల్గుని పీపాక్, రాకీ ఎస్, రోహిత్ గాంధీ తో సహా ఎనిమిది మంది ఈ ఫ్యాషన్ షో కోసం దుస్తులు డిజైన్ చేశారు. అకి నిరుల స్టైలింగ్ బాధ్యత తీసుకున్నారు. సల్మాన్ పెయింటింగ్ ప్రింట్ల నుంచి గౌన్లు డిజైన్ చేశారు. కత్రిన ధరించిన గౌనుతో సహా సుమారు 10 గౌన్లకు ఈ తరహాలో డిజైన్ చేశారు. దుస్తుల డిజైన్, పెయిటింగ్, స్టిచ్చింగ్ కు ముచ్చటగా మూడు రోజులు పట్టింది.
News Posted: 15 October, 2009
|