సల్మాన్ హీరోగా 'కిక్'
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/salman_khan1.jpg' align='right' alt=''>బాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు తెలుగు రీమేక్ లపై పడ్డారు. అమీర్ ఖాన్ హిందీ 'గజనీ' ఆమధ్య సంచలన విజయం సాధించింది. ఇటీవలే 'పోకిరి' హిందీ రేమేక్ 'వాంటెడ్'లోనూ సల్మాన్ నటించారు. ఆ చిత్రం రికార్డు కలెక్షన్లు సాధించి మల్లీ సల్మాన్ ను క్రేజీ హీరోగా నిలిపింది. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా బోనీకపూర్ బ్యానర్ లోనే 'మోస్ట్ వాంటెడ్' చిత్రం చేయాలనే ఆలోచనలో కూడా సల్మాన్ ఉన్నారు. తాజాగా మరో తెలుగు రీమేక్ కు కూడా సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తెలుగులో రవితేజ కథానాయకుడుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించిన 'కిక్' చిత్రం గత సమ్మర్ లో విడుదలైన మంచి హిట్ సాధించింది. ఈ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ హిందీ నిర్మాత సాజిద్ నడియద్ వాలా కోటి రూపాయలు చెల్లించి తన సొంతం చేసుకున్నారు. ఇందులో సల్మాన్ హీరోగా నటించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. కాగా, 'కిక్' చిత్రాన్ని ఎడిటర్ మోహన్ తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తాము నిర్మించిన చిత్రం తమిళంలోనూ, హిందీలోనూ రీమేక్ అవుతుండటం పట్ల ఆర్.ఆర్.మేకర్స్ వెంకట్, సహనిర్మాత వి.సురేష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
News Posted: 19 October, 2009
|