సైఫ్-కరీనా లాంగెస్ట్ కిస్...
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/kurbaan1.jpg' align='right' alt=''>కరీనాకపూర్ లో ఇప్పుడు డేరింగ్ కూడా పెరిగింది. బాయ్ ఫ్రెండ్ సైఫ్ అలీఖాన్ ప్రోత్సాహం ఆమెకు ఎలాగూ ఉండనే ఉంది. దీంతో ఈ ఇద్దరి లవర్స్ మధ్య ఉన్న కెమిస్ట్రీని స్క్రీన్ పై మరింత రొమాంటిక్ గా చూపించేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని దర్శకుడు రెన్సిల్ డిసిల్వ వదులుకోవడం లేదు. కరీనా-సైఫ్ జంటతో 'కుర్బాన్' చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. ఈమధ్యనే ఆయన విడుదల చేసిన పబ్లిసిటీ పోస్టర్లు కలకలం సృష్టించాయి. 'తషన్', 'కంబక్త్ ఇష్క్' చిత్రాల్లో టూ పీస్ బికినీల్లో ఆందాలను ఆరబోసిన కరీనా 'కుర్బాన్' కోసం వీపు వెనుక ఎలాంటి అచ్ఛాదన లేకుండా వెనక్కి తిరిగి నిలబడితే సైఫ్ కూడా చొక్కా లేకుండా ఆమె ముందు నిల్చొని ఉండే పోస్టర్లివి. తాజాగా ఈ సినిమా కోసం సైఫ్, కరీనా జంట మారధాన్ 'లిప్ కిస్' సన్నివేశంలో కూడా పాల్గొన్నట్టు యూనిట్ వర్గాల కథనం. అత్యధిక సమయం ముద్దు సన్నివేశంలో పాల్గొన్న జంటగా వీరు సరికొత్త రికార్డు కూడా సృష్టించబోతున్నారట.
'సైఫ్, కరీనా ఇందులో ప్రేమికులుగా నటిస్తున్నారు. నిజ జీవితంలోనూ వీరు ప్రేమికులే కావడంతో ఇందులోని లిప్ కిస్ చాలా సహజంగా ఉంటుంది. ఇది సందర్భానుసారం వచ్చే సన్నివేశం కావడంతో ఆ ఇద్దరూ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా నటించారు. ఇద్దరి మధ్యా మంచి కెమెస్ట్రీ పండింది' అని డిసిల్వా చెబుతున్నారు. ఈ ముద్దు సన్నివేశం హిందీ పరిశ్రమలో ఇంతవరకూ వచ్చిన ముద్దు సన్నివేశాల కంటే లాంగెస్ట్ కిస్ గా పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
News Posted: 19 October, 2009
|