నీతూచంద్రకు బెదరింపులు!
ఇంట్లో బాగోగులు చూసుకునేందుకు సర్వెంట్లును తెచ్చుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి రావడం ఇవాల్టి తారామణులకు తప్పనిసరి అవుతోంది. ఈమధ్యనే నటి ఆసిన్ సర్వెంట్ కనిపించకుండా పోతే ఆమెపై కేసు పెట్టడం, ఎట్టకేలకు సదరు సర్వెంట్ పోలీసులకు లొంగిపోయి ఇందులో ఆసిన్ తప్పిదం ఏమీలేదనీ, ఆమె నుంచి డబ్బులు రాబట్టడానికే తానే ఈ నాటకం ఆడానంటూ పోలీసుల ముందు ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది. బాలీవుడ్ నటుడు షైనీ అహుజా తన మనిషిపై అత్యాచారం చేసిన అభియోగంపై కటకటాలు లెక్కించి ఈమధ్యనే బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మ నీతూచంద్రకు కూడా ఇంటి పనిమనిషితో తిప్పలు వచ్చి పడ్డాయి.
నీతూచంద్ర ఓ పది నెలల క్రితం తన ఇంటిని కనిపెట్టుకుని ఉండేందుకు ఆషమా అనే నేపాలీ అమ్మాయిని తెచ్చుకుంది. ఇటీవల కాలంలో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఒక్కొక్కటే మాయం అవుతుండటంతో ఆషమాను నీతూ నిలదీసిందంట. వాటి గురించే తనకు తెలియదంటూ ఆమె సమాధానం చెప్పిందట. అప్పట్నించీ సమస్యలు మొదలయ్యాయట. నీతూ ఔట్ డోర్ షూటింగ్ ల కోసం వెళ్లినప్పుడుల్లా ఆషమా భర్త కూడా ఆ ఇంట్లోనే మకాం పెడుతుండటం నీతూకు చిర్రెత్తుకొచ్చిందట. ఆమెను పనిలోంచి తీసేయాలని కూడా అనుకుందట. అలా చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటాననీ, అందుకు నీతూనే కారణని బయట అప్పట్నించీ సమస్యలు మొదలయ్యాయట. నీతూ ఔట్ డోర్ షూటింగ్ ల కోసం వెళ్లినప్పుడుల్లా ఆషమా భర్త కూడా ఆ ఇంట్లోనే మకాం పెడుతుండటం నీతూకు చిర్రెత్తుకొచ్చిందట. ఆమెను పనిలోంచి తీసేయాలని కూడా అనుకుందట. అలా చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటాననీ, అందుకు నీతూనే కారణని బయట ప్రపంచానికి కూడా తెలియజేస్తాననీ ఆషిమా అడ్డం తిరిగిందట. దాంతో దిమ్మెర పోయిన నీతూ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం మొదలుపెట్టిందట. ముందు జాగ్రత్తగా ఆషామా బెదరింపుల గురించి పలువురికి చెప్పి తగిన సాక్షులను కూడా రెడీ చేసుకుంటోందట.
News Posted: 19 October, 2009
|