వేలానికి సల్మాన్?
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/salman_khan1.jpg' align='right' alt=''>బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ త్వరలోనే వేలానికి రాబోతున్నారు. ఈ వేలం వివరాలు ఏమిటనేవి ఇంకా స్పష్టం కానప్పటికీ, సల్మాన్ తో డేట్ చేయాలనుకునే అభిమానుల ముచ్చట ఆయన తీర్చబోతున్నారట. ఇందువల్ల వచ్చే మొత్తాన్ని ఆయన తన సొంత ఛారిటబుల్ ట్రస్ట్ అయిన 'బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్'కు జమ చేయబోతున్నారు.
సల్మాన్ దుందుడుకు వ్యక్తి అనీ, అనుచిత ప్రవర్తన ఆయన నైజమనీ గతంలో విమర్శలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే సల్మాన్ 'మారిన మనిషి'గా ఇటీవల కాలంలో అందిరి అభినందనలు అందుకుంటున్నారు. కెరీర్ పరంగా కూడా తన చిత్రాల ప్రమోషన్ వర్క్ లో అవిశ్రాంతంగా పాల్గొంటున్నారు. 'వాంటెడ్', 'మై ఔర్ మిసెస్ ఖన్నా' చిత్రాలకు విస్తృతంగా ప్రమోషన్ వర్క్ చేసిన సల్మాన్ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న 'లండన్ డ్రీమ్స్' కోసం దేశంలోనూ, మధ్యప్రాశ్చంలోనూ సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. అయితే ముంబైలో జరగబోయే 'వేలం' కార్యక్రమం కోసం ఆయన నేరుగా ముంబై చేరుకుంటారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు. అయితే ఈ వార్తను ఆయన సన్నిహితులు ఇంకా ధ్రువీకరించలేదు. అలాగని నిరాకరించడం లేదు కూడా. 'సల్మాన్ ఏం చేయబోతున్నారనేది మాత్రం అందరికీ షాకింగ్ గానే ఉంది' అంటూ పలువురు ఉత్సుకత చూపుతున్నారు.
News Posted: 22 October, 2009
|