శిల్పా-రాజ్ నిశ్చితార్ధం
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/shilpa-raj.jpg' align='right' alt=''>బాలీవుడ్ బ్యూటీ శిల్పాషెట్టికి ఎట్టకేలకు తన బాయ్ ఫ్రెండ్, లండన్ కు చెందిన పారిశ్రామిక వేత్త రాజ్ కుంద్రాతో ఈ శనివారమే నిశ్చితార్ధం జరుగనుంది. ముంబై జూహూలోని రాజ్ కుంద్రా రెసిడెన్స్ లో ఈ సెర్మనీ జరుగనుంది. దీపావళి రోజు రాజ్ కుంద్రా ఈ ప్రస్తావన చేశారనీ, శనివారం మంచి ముహూర్తం ఉండటంతో నిశ్చితార్ధానికి ఇద్దరూ తమ సుముఖత వ్యక్తం చేశారనీ కుటుంబ వర్గాలు తెలిపాయి. నిశ్చితార్ధం రోజున శిల్పా శెట్టి మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర ధరించనుంది. రాజ్ కుంద్రా సొంతంగా తన డ్రెస్ డిజైన్ చేసుకుంటున్నారు. ఆయన తల్లిదండ్రులు లండన్ నుంచి ముంబై చేరుకుని ఈ వేడుకలో పాల్గొంటారు. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించనుండటంతో ఇరు కుటుంబాల వారు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరుకానున్నారు.
యుకె రియాల్టీ షో 'బిగ్ బ్రదర్స్' సమయంలో రాజ్ కుంద్రా, శిల్పాల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత శిల్పా పెర్ ఫ్యూమ్ లాంచింగ్ కు రాజ్ సహాయాన్ని ఆమె తీసుకున్నారు. శిల్పా సెంట్ ఆమె పట్ల తన ఆకర్షణ పెరగడానికి కారణమైందటూ కుంద్రా ఓ సందర్భంలో చమత్కరించారు. శిల్పా షెట్టి బాలీవుడ్ తో తన అనుబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్న రాజ్ కుంద్రా ఇప్పుడు ముంబైకి తన మకాం మార్చాలని కూడా అనుకుంటున్నారు. లండన్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉందనీ, ముంబైలో అయితే అందరూ అందుబాటులో ఉంటారనీ, లండన్ లో అయితే ఎవరి పని వారే చేసుకోవాలనీ రాజ్ చెబుతున్నారు. మనసెరిగిన భర్త దొరకడం శిల్పా అదృష్టమనే చెప్పాలి మరి.
News Posted: 23 October, 2009
|