హృతిక్ పార్టీకి పోలీసుల చెక్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/hrithik11.jpg' align='right' alt=''>ముంబై: రోజురోజుకూ పెరుగుతున్న శబ్ధ కాలుష్యంపై ముంబై పోలీసులు శబ్ధ కాలుష్య నిరోధక చట్టాన్ని తెచ్చినప్పటికీ అడపాదడపా సినీ ప్రముఖులు హోరెత్తించే వాయిద్యాల ఘోషతో అర్ధరాత్రి నుంచి తెల్లవార్లూ పార్టీలు జరుపుకొంటూ ఇరుగుపొరుగు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. హృతిక్ రోషన్ ఆదివారం రాత్రి తన ఎల్ పలజూ జూహూ రెసిడెన్స్ లో ఇచ్చిన లేట్ నైట్ పార్టీకి పరిశ్రమకు చెందిన ఆయన సన్నిహితులు కొందరు హాజరయ్యారు. తెల్లవారు జామున 3 గంటల వరకూ హోరెత్తించే మ్యూజిక్ తో ఈ పార్టీ జరగడంతో చుట్టుపక్కల వారంతా జాగరణ చేయాల్సి వచ్చింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ పార్టీని అడ్డుకున్నారు.
తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఫోన్ చేసి హృతిక్ ఇంటి నుంచి వస్తున్న భారీ మ్యూజిక్ సౌండ్ కారణంగా తనకు రాత్రంతా నిద్రలేదంటూ ఫిర్యాదు చేసినట్టు జుహూ పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ రామచంద్ర మనె తెలిపారు. 30 నిమిషాల్లోనే తాము ఎల్ పలాజూ రెసిడెన్స్ కు వెళ్లాలనీ, అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్న డిజే తమకు కనిపించాడని ఆయన తెలిపారు. దీంతో హృతిక్ ను తాము హెచ్చరించడంతో వెంటనే ఆయన మ్యూజిక్ ను నిలిపి వేయించారని తెలిపారు. నిబంధనల ప్రకారం 10 గంటల తర్వాత వాయిద్య పరికరాలతో శబ్ద కాలుష్యం సృష్టించిన వారికి 200 వరకూ ఫైన్ విధించవచ్చు. అయితే హృతిక్ కు ఎలాంటి జరిమానా విధించలేదని సమాచారం. 'హెచ్చరించడం మా విధి. మేము అదే చేశాం' అని జూహూ పోలీస్ ఇన్ స్పెక్టర్ కె.సావంత్ వ్యాఖ్యానించారు. ఇక్కడో కొసమెరుపు కూడా ఉంది. పోలీసుల హెచ్చరిక తర్వాత కూడా పార్టీ సెలబ్రేషన్ ఆగలేదు. వారు ఇలా వెళ్లిన వెంటనే పార్టీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చింది. మ్యూజిక్ వాల్యూమ్ మాత్రం మంద్ర స్థాయిలో ఉంచారు. నీలమ్, రితీష్ దేశ్ ముఖ్, చుంకీ పాండే తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు.
News Posted: 26 October, 2009
|